కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్ధతు: మంత్రి ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం అవినీతికి బీజేపీ సపోర్ట్‌.. కిషన్‌రెడ్డి విమర్శలకు తెలంగాణ సర్కార్‌ కౌంటర్‌

Published Tue, Jan 2 2024 6:30 PM

Telangana Minister Uttam Kumar Reddy Counter Kishan Reddy - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: బాధ్యతలు తీసుకుని నెలైనా గడవక ముందే తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సీబీఐ విచారణ డిమాండ్‌ చేసే క్రమంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన రాజకీయ విమర్శలకు మంత్రి ఉత్తమ్‌ మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ కౌంటర్‌ ఇచ్చారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి.  కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్‌ మార్చారు. స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది. పవర్‌, ఇరిగేషన్‌ కార్పొరేషన్‌కు నిబంధనలు మార్చేసి మరీ లోన్‌ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు మంజూరు చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల లోన్‌ బీజేపీ ఇప్పించింది. ‘‘దోచుకుందాం’’ అని లక్షల కోట్లు ఇచ్చారా?..

మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విజిట్‌ చెయ్యలేదు?. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?. సీబీఐ-ఈడీ అంటూ ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?.  కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా పదే పదే అన్నారు కదా.. మరి ఎందుకు విచారణకు అదేశించలేదు?

.. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్‌ఎస్‌ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు  కోరలేదు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం. .. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్‌ విచారణ ఈ వారంలోనే మొదలు పెట్టాం. పదేళ్లపాటు అవినీతి కోసం బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కలిసి పని చేశాయి. బాధ్యతలు తీసుకుని 20 రోజలైనా గడవక ముందే మాపై విమర్శలా?. కేసీఆర్‌ మాట్లాడకపోవడాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరు తప్పు చేసినా మేం వదిలిపెట్టం అని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు.

అంతకు ముందు.. కాళేశ్వరం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. ‘‘కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్‌ను రక్షించేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోంది. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవినీతి.. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్యనా?’

Advertisement
Advertisement