57 నెలలో మీ బిడ్డ 124 సార్లు బటన్‌ నొక్కాడు | Sakshi
Sakshi News home page

57 నెలలో మీ బిడ్డ 124 సార్లు బటన్‌ నొక్కాడు

Published Sat, Feb 3 2024 5:08 PM

YS Jagan Calls YSRCP Cadre At Denduluru Public Meeting - Sakshi

ఏలూరు, సాక్షి: వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించేవని..కాబట్టి జరిగిన మంచిని వంద మందికి చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం ఏలూరు దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

ఎన్నికలప్పుడు కొందరు పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తారు.. మేనిఫెస్టోలు రిలీజ్‌ చేస్తారు. ఆ తర్వాత చెత్త బుట్టలో పడేస్తారు. అది వాళ్లకు అలవాటైన పనే. అయితే 99 శాతం హామీల అమలుతో మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చేందే మీ జగన్‌, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. కళ్లుండి.. ఈర్ష్యతో చూడలేని కబోదిలు.. ఏమంటున్నారో అంతా వింటున్నారు. వాళ్లకు ఎక్కువ టీవీ చానెల్స్‌, పేపర్లు ఉన్నాయి. కాబట్టి తిట్టేవాళ్లు ఎక్కువే. వాళ్ల నోళ్లు మంచివి కావు. 

.. అబద్ధాల పునాదుల మీద వాళ్ల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమో.. అవసరమో.. ప్రతీ ఒక్కరికీ మీరే(పార్టీ కేడర్‌ను ఉద్దేశించి..)చెప్పాలి. ‘‘కేవలం ఒక  ఎమ్మెల్యే, ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గమనించండి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలివి’’ ప్రతీ ఒక్కరికీ చెప్పాలని పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ సూచించారు. 

ఇప్పటికే రూ. 3 వేలు చేసిన పెన్షన్.. 1వ తేదీ ఉదయాన్నే ఈ 3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా.. భవిష్యత్ లో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి. ఇదిజరగాలి అంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పండి. 

బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.  అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనాగాసాలన్నా, సున్నా వడ్డీ రావాలన్నా, ఆసరా తు.చ.తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. కనీసం 100 మందికి అయినా చెప్పి ఓటు వేయించాలి, మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని చెప్పండి. 

.. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతోపాటు పేద అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేరాలన్నా, మహిళా సాధికారతకు ఏ మంచిజరగాలన్నా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలన్నా, ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధనతో మొదలు,ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు రావాలన్నా, పెద్ద చదువులు 100 శాతం ఫీజు రీయింబర్ష్ మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, అంతర్జాతీయ చదువులు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పండి. 

పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, 100 మందికి చెప్పాలని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకూ చెప్పండి. గ్రామాల్లో ప్రతి రైతన్నకూ చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, సీజన్ ముగిసేలోపే ఆ రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని ప్రతి రైతన్నకూ వెళ్లి చెప్పండి. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని అడగండి. 

ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం 2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపింది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని, గడపగడపకూ వెళ్లి కోరండి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఈరోజు నెల 1వ తేదీన పొద్దున్నే చిరునవ్వుతో ప్రతి అవ్వాతాత, ప్రతి అన్న తమ్ముడు, చెల్లెమ్మకూ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందుతున్నాయి.  ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ బతికించినట్లవుతుందని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అంటే జగనన్నను మర్చిపోకూడదు, 124 సార్లు బటన్ నొక్కాడు, ఆయన కోసం రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

ఆ ఇంటికే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్సార్ సీపీ కొనసాగాలి. ఈరోజు జగనన్న దేవుడిని, మనల్నే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు జగనన్నకు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతీ ఒక్కరి.. ప్రతీ రంగం.. అందరి సంక్షేమం ఈ ఎన్నికలతో ముడిపడి ఉందని గుర్తించాలని సీఎం జగన్‌ కోరారు. రూ.3,000 పెన్షన్‌ అందాలన్నా.. భవిష్యత్తులో ఇది పెరగాలన్నా.. ఇంటికే అది రావాలన్నా.. వైద్యం ప్రతీ ఒక్కరి చెంతకు చేరాలన్నా.. అప్పుల పాలు కావొద్దన్న.. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్లి చెప్పాలి’అని కేడర్‌కు సీఎం జగన్‌ సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement