ప్రజలు కోరిందే తీర్మానించాం! | Sakshi
Sakshi News home page

ప్రజలు కోరిందే తీర్మానించాం!

Published Mon, Jan 1 2024 2:04 AM

- - Sakshi

సిరిసిల్ల: ప్రజాపాలన దరఖాస్తుల్లో పలు ఆప్షన్లను కోరారని వాటినే మున్సిపల్‌ ఎజెండాలో ఉంచి తీర్మానం చేశామని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంపై భేషజాలకు పోకుండా పలు అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌కోసం ప్రత్యేకంగా ఆప్షన్లు ఇవ్వాలని కోరామన్నారు. ఈవిషయాలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. కానీ కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, విలీన గ్రామాలను జీపీలు చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రకటించారని పేర్కొన్నారు. రూ.వందల కోట్ల ఖర్చుతో బైపాస్‌రోడ్డు వేయించారని, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయించారని ఇవన్నీ విలీన గ్రామాల అభివృద్ధికి దోహదం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వస్త్ర పరిశ్రమలో నేతకార్మికులు, పద్మశాలీలను పూర్తిస్థాయిలో కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదుకున్నారని, కేవలం రాజకీయ లబ్ధికోసం వారిని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. సమావేశంలో టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్‌ డైరెక్టర్‌ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్‌, సత్తార్‌, వేణు, పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
Advertisement