అన్నారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

అన్నారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

Published Tue, Nov 14 2023 4:22 AM

చింతా ప్రభాకర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్‌ నేతలు - Sakshi

సంగారెడ్డి టౌన్‌: అన్నారం పంచాయతీ కార్యదర్శి జీఎం సుదర్శన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వ భూమిలో ఆరుగురు ప్రైవేటు వ్యక్తులకు ఇంటి నంబర్లు కేటాయించడంపై విచారణ చేపట్టగా వాస్తవమేనని తేలడంతో కలెక్టర్‌ శరత్‌ సోమవారం సెస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతను తన రక్త సంబంధీకులకు, ఒక వార్డు సభ్యుడి బంధువులకు ప్రభుత్వ భూమిలో ఇంటి నంబర్లు కేటాయించారని ఇన్‌చార్జి సర్పంచ్‌ ఫిర్యాదు చేయగా, గుమ్మడిదల పంచాయతీ అధికారి విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. అందులో నేరం రుజువు కావడంతో తక్షణమే విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను సమర్పించాలని డివిజనల్‌ పంచాయతీ అధికారిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

‘క్రాంతి కిరణ్‌ అఫిడవిట్‌పై హైకోర్టుకు వెళ్తాం’

జోగిపేట (అందోల్‌): బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ వివరాలు పేర్కొన లేదని, దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్‌ అభ్యర్థి ఏజెంట్‌ అద్దంకి వీరన్న, హైకోర్టు న్యాయవాదులు రాంబాబు, శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నామినేషన్‌ల పరిశీలన సమయంలో రిటర్నింగ్‌ అధికారి పాండుకు ఫిర్యాదు చేశారు. క్రాంతి కిరణ్‌ నామినేషన్‌ పత్రాల్లో పొందుపరిచిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలను ఇవ్వలేదన్నారు. 2021–22కు సంబంధించి వార్షిక ఆదాయం జీరోగా చూపించారన్నారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ వేతనాన్ని తీసుకోలేదా? ఆయన పేరిట ఉన్న 5 ఎకరాల భూమికి తీసుకున్న రైతుబంధును వాపస్‌ చేశారా? అని ప్రశ్నించారు. ఆయన కుమారుడు చంటి ఆశాంక్‌ మైనర్‌ అని ఇది కూడా అవిడవిట్‌లో పేర్కొనలేదని తెలిపారు. నామినేషన్‌ తిరస్కరించా లని కోరుతూ ఫిర్యాదు చేశామన్నారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోనట్లయితే హైకోర్టుకు వెళతామని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్‌కు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అభివృద్ధిలో ముందంజ

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌

సదాశివపేట(సంగారెడ్డి): అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివారం చందాపూర్‌, ఎన్కెపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉన్నానని, ఒక్క అవకాశం ఇస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ విశ్వనాథం ఆధ్వర్యంలో చందాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీటీసీ మాణేయ్య, బీజేపీకి చెందిన 200 మంది చేరారు. ఎన్కెపల్లి మాజీ సర్పంచ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ రాములు ముది రాజ్‌ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఫారుక్‌, నాయకులు కార్యకర్తలు 50 మంది సైతం చేరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ఎంపీటీసీ అహ్మద్‌, సర్పంచ్‌ శేఖర్‌, మాజీ మండల కోఆప్షన్‌ మెంబర్‌ సలావుద్దీన్‌, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

వలలో చిక్కుకొని వ్యక్తి మృతి

వట్‌పల్లి(అందోల్‌): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ విఠల్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొన్యాల యాదయ్య(40) ఆదివారం మధ్యా హ్న 3 గంటల సమయంలో మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాలేదు. సోమవారం గ్రామానికి చెందిన వ్యక్తి నది వద్దకు వెళ్లగా వలలో చిక్కుకొని అతడు మరణించి ఉండటాన్ని గమనించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించా రు. యాదయ్య తల్లి లచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

యాదయ్య
1/1

యాదయ్య

Advertisement
Advertisement