పీటీజెడ్‌ కెమెరాలతో నిఘా | Sakshi
Sakshi News home page

పీటీజెడ్‌ కెమెరాలతో నిఘా

Published Thu, Nov 16 2023 6:20 AM

వాహనంపై ఏర్పాటు చేసిన పీటీజెడ్‌ కెమెరా  - Sakshi

● వాహనాలపై ప్రత్యేకంగా ఏర్పాటు ● అభ్యర్థుల ప్రచార తీరు రికార్డు

నారాయణఖేడ్‌: అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై అధికార యంత్రాంగం నిఘా పెరుగుతోంది. ప్రచార తీరు, ప్రవర్తన నియమావళి అమలు, జన సమీకరణ, వాహన శ్రేణి, గొడవలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తమ వాహనాలకు అధునాతన పీటీజెడ్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇవి 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ సుమారు 50 మీటర్ల దూరం వరకు నాణ్యతతో వీడియో రికార్డింగ్‌ చేస్తుంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో నిజాంపేట్‌, కల్హేర్‌, పెద్దశంకరంపేట మండలాలు కలుపుతూ ఒక రూట్‌గా విభజించి ఒక వాహనం, కంగ్టి, సిర్గాపూర్‌ రూట్‌కు మరో వాహనం, మనూరు, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్‌ మండలాలతో మూడో రూట్‌గా నిర్ణయించి ఒక వాహనం చొప్పున కేటాయించారు. ఇవన్నీ పీటీజెడ్‌ సీసీ కెమెరా జీపీఎస్‌ ద్వారా కలెక్టరేట్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి. ఫ్లయింగ్‌ స్వాడ్‌ అధికారులు ఈ వాహనాల ద్వారా పర్యవేక్షణ చేస్తుంటారు.

బ్యాటరీ, జీపీఎస్‌ సదుపాయం
1/1

బ్యాటరీ, జీపీఎస్‌ సదుపాయం

Advertisement
Advertisement