సర్క్యులర్‌ రద్దు చేయాల్సిందే | Sakshi
Sakshi News home page

సర్క్యులర్‌ రద్దు చేయాల్సిందే

Published Sat, Nov 11 2023 4:24 AM

మాట్లాడుతున్న భాస్కర్‌ - Sakshi

చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దకోడూరులో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలన్నారు. మీటర్‌ రీడర్స్‌ను ఆర్టిజన్‌గా గుర్తించాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు రామ్‌రెడ్డి, శ్రీనివాస్‌, వెంకట్‌, రాజు, లింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement