Sakshi News home page

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం

Published Thu, Sep 21 2023 5:04 PM

Alastair Cook Is Set To Retire From All Forms Of Cricket - Sakshi

క్రికెట్‌ దిగ్గజం​, ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ బ్యాటర్‌, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ సీజన్‌ (2023) ముగిసిన అనంతరం తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు (161 టెస్ట్‌ల్లో 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్ధసెంచరీల సాయంతో 12472 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కుక్‌.. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆతర్వాత కంటిన్యూయెస్‌గా కౌంటీల్లో ఆడుతున్నాడు.

కుక్‌ తన కౌంటీ జట్టైన ఎసెక్స్‌ తరఫున ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్‌.. 36.72 సగటున శతకం, 3 అర్ధశతకాల సాయంతో 808 పరుగులు చేశాడు. కుక్‌ ప్రస్తుతం హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ (0) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌తో పాటు కుక్‌ మరో మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ సీజన్‌లో ఎసెక్స్‌కు ఇదే ఆఖరి మ్యాచ్‌. హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతర్వాత జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే ఎసెక్స్‌కు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డివిజన్‌ వన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఎసెక్స్‌.. టాప్‌లో ఉన్న సర్రే కంటే 15 పాయింట్లు వెనుకపడి ఉంది. 

ఇదిలా ఉంటే, అలిస్టర్‌ కుక్‌ ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ల్లో టాప్‌ స్కోరర్‌గా నిలువడమే కాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. 

Advertisement

What’s your opinion

Advertisement