Asian Games 2023 Cricket Squad announcement soon - Sakshi
Sakshi News home page

Asian Games 2023: రింకూ సింగ్‌కు గుడ్‌ న్యూస్‌.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా

Published Thu, Jul 6 2023 12:30 PM

Asian Games 2023 Cricket Squad announcement soon; Rinku Singh, Ruturaj, Jitesh to travel to China - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు విండీస్‌ సిరీస్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మకు మాత్రమే ఛాన్స్‌ ఇచ్చి వీరిముగ్గరిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే వీరిని ఎంపికచేయకపోవడానికి ఓ ప్రధాన కారణం ఉందంట.

వీరి ముగ్గురిని చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా  చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు తొలిసారి పాల్గొంటోంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఈ క్రీడలకు ద్వితీయశ్రేణి జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు సమాచారం. ఈ జట్టుకు శిఖర్‌ ధావన్‌ సారధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలకు భారత జట్టును బీసీసీఐ మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

ఎందుకంటే బీసీసీఐ జూలై 15లోగా ఆటగాళ్ల జాబితాను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మతో పాటు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మలకు  ఆసియా గేమ్స్‌కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆసియాక్రీడలకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా వంటి స్టార్‌ క్రికెటర్లు దూరంగా ఉండనున్నారు.  ఈ ఆసియా గేమ్స్‌ సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరగనున్నాయి.

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: IND vs WI: ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి టీమిండియాలోకి.. క్రికెట్‌ కిట్‌ కొనడానికి కూడా అప్పు చేసి! హ్యాట్సాఫ్‌ తిలక్

Advertisement
Advertisement