ఆనంద‌పు క్ష‌ణాలు..తోడు ఉండాల్సిందే

24 Oct, 2020 18:30 IST|Sakshi

ఆనందపు క్ష‌ణాల‌ను పూర్తిగా అనుభ‌వించ‌డానికి మ‌న‌కు తోడుగా ఒక‌రు ఉండాల్సిందే అంటూ  బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్ చేశారు. ప్రియుడు తమిళ హీరో విష్ణు విశాల్‌తో క‌లిసి ఉన్న ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. గత రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట  గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు.

ఇక హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు.కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌ )

To get full value of joy,you must have someone to divide it with!! “MARK TWAIN”

A post shared by Jwala Gutta (@jwalagutta1) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు