T20 WC 2022: Habibul Bashar Says India And South Africa Are Going Into The Semi-Finals Of The T20 World Cup - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: పాకిస్తాన్‌ ఇంటికే.. ఆ రెండు జట్లే సెమీ ఫైనల్‌కు!

Published Tue, Oct 25 2022 9:09 AM

India and South Africa are going into the semi finals of the world cup: Bashar - Sakshi

టీ20 ప్రపంచకప్‌ 2022ను అద్భుతమైన విజయంతో టీమిండియా ఆరంభించింది. ఆదివారం (ఆక్టోబర్‌23)న మెల్‌బోర్న్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సంచలన విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. గ్రూప్‌-2 నుంచి సెమీఫైనల్‌కు చేరుకునే జట్లను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ అంచనావేశాడు.

ఈ మెగా ఈవెంట్‌ సెమీ ఫైనల్‌కు గ్రూప్‌-2 నుంచి దక్షిణాఫ్రికా, భారత జట్టలు చేరుతాయని బషర్ జోస్యం చేప్పాడు. అదే విధంగా పాకిస్తాన్‌ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పడుతుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా గ్రూప్‌-2లో మొత్తం ఆరు జట్లు ఉన్నాయి.

ఇప్పటికే బంగ్లాదేశ్‌, భారత్‌ చెరో విజయంతో గ్రూప్‌-2 నుంచి పాయింట్స్‌ టెబుల్‌ టాపర్స్‌ నిలవగా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చెరో పాయింట్‌తో మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక తొలి మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.

ఈ క్రమంలో బషర్ క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.." పాకిస్తాన్‌ అత్యుత్తమ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాక్‌ జట్టు అద్భుతమైన బౌలింగ్‌ లైనప్‌ కలిగి ఉంది. కానీ వారి బ్యాటింగ్‌ లైనప్‌ మాత్రం దారుణంగా ఉంది. ముఖ్యంగా మిడాలర్డర్‌లో బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు.

బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే ఈ టోర్నీలో పాక్‌ ముందుకు వెళ్లడం కష్టమే. అదే భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి గ్రూప్‌-2 నుంచి దక్షిణాఫ్రికా, భారత జట్టు సెమీఫైనల్లో అడుగు పెడతాయని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup 2022: దురదృష్టం అంటే దక్షిణాఫ్రికాదే.. గ్లౌవ్‌ను తాకినందుకు ఐదు పరుగులు

Advertisement
Advertisement