IPL 2023 CSK Vs LSG Playing XI, Match Live Score Updates In Telugu, Latest News, Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 CSK Vs LSG Live Updates: బోణీ కొట్టిన సీఎస్‌కే.. లక్నోపై ఘన విజయం

Published Mon, Apr 3 2023 7:00 PM

IPL 2023 CSK Vs LSG Playing XI Updates And Highlights - Sakshi

IPL 2023 CSK Vs LSG Playing XI Updates And Highlights:

చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగల్గింది.

లక్నో బ్యాటర్లలో కైల్‌ మైర్స్‌(22 బంతుల్లో 53 పరుగులు), పూరన్‌(32) కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ లక్నో విజయానికి చేరువ కాలేకపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ 4వికెట్లతో చెలరేగగా.. తుషార్‌ దేశ్‌పాండే రెండు, శాంట్నర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన 

సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(57), డెవాన్‌ కాన్వే(47), అంబటి రాయుడు(27) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.

ఆఖరిలో ధోని కూడా సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లక్నో బౌలర్‌లో మార్క్‌ వుడ్‌, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

15 ఓవర్లకు లక్నో స్కోర్‌: 150/5
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లక్నో విజయానికి 30 బంతుల్లో 68 పరుగులు కావాలి. క్రీజులో పూరన్‌(31), బదోని(5) ఉన్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌
మొయిన్‌ అలీ ధాటికి లక్నో మరో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన కృనాల్‌ పాండ్యా.. అలీ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లు లక్నో స్కోర్‌: 110/4

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో..
లక్నో సూపర్‌ జెయింట్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో..
లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. 2పరుగులు చేసిన దీపక్‌ హుడా.. శాంట్నర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు లక్నో స్కోర్‌: 82/3

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో
79 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కైల్‌ మైర్స్‌(22 బంతుల్లో 53 పరుగులు).. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

దూకుడుగా ఆడతున్న లక్నో
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా లక్నో 38 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(10), కైల్‌ మైర్స్‌(27) పరుగులతో ఉన్నారు.

లక్నో టార్గెట్‌ 218 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(57), డెవాన్‌ కాన్వే(47), అంబటి రాయుడు(27) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.

ఆఖరిలో ధోని కూడా సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లక్నో బౌలర్‌లో మార్క్‌ వుడ్‌, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
178 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బెన్‌ స్టోక్స్‌.. ఆవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

15.2 ఓవర్లకు సీఎస్‌కే 4వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్‌, రాయుడు ఉన్నారు.

రెండో  వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. కాన్వే  ఔట్‌

డెవాన్‌ కాన్వే రూపంలో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన కాన్వే.. వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 121/2

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే 
110 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రుత్‌రాజ్‌ గైక్వాడ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శివమ్‌ దుబే వచ్చాడు. 

గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ
ఐపీఎల్‌-2023లో సీఎస్‌కే ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రుత్‌రాజ్‌ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. కక్రీజులో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(50), కాన్వే(39) పరుగులతో ఉన్నారు.

గైక్వాడ్‌ దూకుడు.. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 79/0

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్‌(20 బంతుల్లో46), కాన్వే(23) పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 23/0
2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్‌(6), కాన్వే(11) పరుగులతో ఉన్నారు.

ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. లక్నో ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన జయదేవ్‌ ఉనద్కట్‌ స్ధానంలో రవిసింగ్ ఠాకూర్ తుదిజట్టులోకి వచ్చాడు.

సీఎస్‌కే మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా  ఆడనుంది. కాగా నాలుగేళ్ల తర్వాత చెపాక్‌లో సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడుతోంది. దీంతో స్టేడియం మొత్తం ధోని నినాదంతో దద్దరిల్లిపోతుంది.

తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ రవిసింగ్ ఠాకూర్

చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్

Advertisement
Advertisement