కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్‌ | Sakshi
Sakshi News home page

కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం

Published Sun, Jan 7 2024 6:52 PM

Kieron Pollard Has Been Named As Captain Of MI Cape Town Ahead Of SA20 2024 - Sakshi

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ల కోసం​ తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌, ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్‌టౌన్‌కు (SA20 2024) కీరన్‌ పోలార్డ్‌, ఎంఐ ఎమిరేట్స్‌కు (ILT20 2024) నికోలస్‌ పూరన్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది.

కాగా, కీరన్‌ పోలార్డ్‌ అమెరికా వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్‌ ఇటీవల తమ కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం. మహిళల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వ్యవహరిస్తుంది. 

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ల తర్వాత మే నెలలో ఐపీఎల్‌ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్‌ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ సౌతాఫ్రికా పేస్‌ గన్‌ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్‌ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌ పూర్తి జట్టు..

  1. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌ 16 కోట్లు
  2. జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు
  3. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు
  4. ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు
  5. డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు
  6. తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు
  7. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్‌)
  8. టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు
  9. అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు
  10. కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు
  11. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు
  12. ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు
  13. విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు
  14. రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు
  15. షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు
  16. నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు
  17. పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు
  18. గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు
  19. దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు
  20. శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు
  21. నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు
  22. నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  23. అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు
  24. మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు
  25. శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు

 
 

Advertisement
Advertisement