Sakshi News home page

Rohit Sharma: నెదర్లాండ్స్‌పై గెలుపు.. 'సంతోషంగా మాత్రం లేను'

Published Thu, Oct 27 2022 6:33 PM

Rohit Sharma Comments After IND Win-Over NED Not So-Happy-About-Fifty - Sakshi

టి20 ప్రపంచకప్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ విజయం అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ''అభిమానులకు ఇది నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. పాకిస్తాన్‌పై స్పెషల్‌ విజయాన్ని మరువక ముందే వారం వ్యవధిలోనే రెండో విజయాన్ని నమోదు చేశాం. అయితే వేదిక మాత్రం మెల్‌బోర్న్‌ నుంచి సిడ్నీకి మారింది. మ్యాచ్‌ గెలుపు మాకు ముఖ్యం. ఎందుకంటే మ్యాచ్‌ గెలిస్తే వచ్చే రెండు పాయింట్లు మమ్మల్ని ముందు నిలబెడతాయి.

ఇక నెదర్లాండ్స్‌పై విజయం క్లినికల్‌ విన్‌గా అభివర్ణించొచ్చు. ఇక మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడంపై అంత సంతోషంగా మాత్రం లేను. ఎందుకంటే 35 బంతుల్లో 50 పరుగులు చేయగలిగాను. ఇంకా తక్కువ బంతుల్లో చేసి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా జట్టుకు పరుగులు రావడం ముఖ్యం. అయితే ఈ ఫిఫ్టీతో నాలో ఆత్మవిశ్వాసం మాత్రం పెరిగింది'' అంటూ ముగించాడు. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఫిఫ్టీలతో కథం తొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లందరూ మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్‌ భారీ తేడాతో ఓడింది. భువీ 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు కూడా తలో 2 వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్‌ దక్కింది. సూపర్‌-12లో వరుసగా రెండు విజయాలతో గ్రూఫ్‌-2లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను ఆదివారం(అక్టోబర్‌ 30న) సౌతాఫ్రికాతో ఆడనుంది.

చదవండి: లంకకు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలక ఆటగాడు దూరం

అద్భుత ఇన్నింగ్స్‌.. రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి.. అగ్రస్థానంలోకి సూర్య

Advertisement

What’s your opinion

Advertisement