సుధీర్‌ నేరసామ్రాజ్యంపై లోతుగా విచారణ | Sakshi
Sakshi News home page

సుధీర్‌ నేరసామ్రాజ్యంపై లోతుగా విచారణ

Published Thu, Nov 16 2023 12:04 AM

-

త్వరలో పోలీస్‌ కస్టడీకి

నెల్లూరు(క్రైమ్‌): దేవరకొండ సుధీర్‌ నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సుధీర్‌ ప్రధాన అనుచరుడు శివకుమార్‌రెడ్డిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకే బంగారం ఇస్తామని.. పొలాలు అమ్ముతామని.. నోట్ల మార్పిడి.. నకిలీ పోలీసుల ముసుగులో మోసాలు, నేరాలకు సంబంధించిన పలు కీలక సమాచారాన్ని రాబట్టి దాని ఆధారంగా విచారణ జరుపుతున్నారని తెలిసింది. సుధీర్‌ ఫోన్‌కాల్‌ లిస్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయనకు ఎవరెవరితో దగ్గరి సంబంధాలున్నాయి.. మోసాలతో వారికేమైనా ప్రమేయం ఉందాననే కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారని సమాచారం. మరోవైపు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సుధీర్‌ను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే న్యాయస్థానాన్ని అధికారులు కోరారని తెలిసింది. అనుమతి రాగానే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నారు. సుధీర్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌ అనంతరం వారి మోసాలపై తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు స్పందనలో ఫిర్యాదు చేయగా, వీటిపై సైతం విచారణ సాగుతోంది.

వీఆర్‌కు దిశ డీఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): దిశ డీఎస్పీ సురేష్‌బాబును వీఆర్‌కు బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు డీటీసీ డీఎస్పీ శిరీషకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు.

Advertisement
Advertisement