రూ.70లకు చేపతో భోజనం | Sakshi
Sakshi News home page

రూ.70లకు చేపతో భోజనం

Published Mon, Jan 29 2024 12:32 AM

- - Sakshi

శ్రీకాకుళం: ఒకప్పుడు రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న ఆమె వ్యాపారం.. నేడు చక్కటి షాపులోకి చేరింది. సముద్రంలోకి వేటకు వెళ్లి కష్టపడిన ఆమె భర్త.. నేడు ఇతర ప్రాంతాల నుంచి చేపలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. చదువుల కోసం ఇబ్బంది పడిన కుమార్తెలు.. సగర్వంగా నేడు కాలేజీకి వెళ్తున్నారు. వైఎస్సార్‌ సీపీ వినూత్న విధానాలతో తీరిన వెతలకు, మారిన బతుకులకు బర్రి తోటమ్మ కు టుంబం ఓ నిదర్శనం. ఫిష్‌ ఆంధ్రా మొదలుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరకు సంక్షేమ పథకాలను వినియోగించుకుని చక్కటి బతుకు బాటను ఏర్పరచుకున్నారు.

తోటమ్మది శ్రీకాకుళం రూరల్‌ మండలం చిన గనగళ్లపేట గ్రామం. ఈమె భర్త రామారావు సముద్రంలో చేపల వేటకు వెళ్లి వచ్చినప్పుడు సంపాదించిన మొత్తంతో కుటుంబమంతా జీవనం సాగించేది. కొన్నేళ్ల కిందట వీరు కుమార్తెల చదువుల కోసం శ్రీకాకుళం పట్టణానికి కుటుంబంతో పాటు వచ్చేశా రు. మండల వీధిలో నివాసం ఉంటూ జీవ నోపాధికి అరసవల్లి కూడలి వద్ద రోడ్డు పక్కన చేప లు విక్రయించేవారు. కుమార్తెలను చవివిస్తూ కుటుంబాన్ని పోషించటం కష్టంగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ కుటుంబం సమర్థంగా వినియోగించుకుంది. పిల్లలకు జగనన్న ఇస్తున్న ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ వస్తోంది. భర్తకు ఏటా వేట విరామ సమయంలో భృతి అందడం మొదలైంది. వీటన్నంటికంటే ‘ఫిష్‌ ఆంధ్రా’ అవకాశాన్ని తోటమ్మ ఒడిసిపట్టుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం.

వినూత్నంగా విస్తరణ
మత్స్యకారుల కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభు త్వం అమలు చేసిన ఫిష్‌ ఆంధ్రా పథకం ఆ కుటుంబానికి వరంగా మారింది. అరసవల్లి కూడలి వద్ద మూడు నెలల కిందట ఫిష్‌ ఆంధ్రా షాపును నెలకొల్పి తాజా చేపల విక్రయాన్ని ప్రారంభించారు. రూ.2.2లక్షల బ్యాంకు రుణంతో షాపును ఏర్పాటు చేసుకున్నారు. దీనికి 40శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. వ్యాపారం రెట్టింపు కావటంతో వినూత్న తరహాలో విస్తరించారు. వారానికి అరటన్నుకు పైగా చేపలను విక్రయిస్తున్నారు.

రూ.70లకు చేపతో భోజనం
తోటమ్మకు కొత్త తరహా ఆలోచన రావటంతో రూ.70 లకే పూర్తి స్థాయిలో చేపల పులుసుతో పాటు చేప ముక్కతో భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. వినియోగదారుల కోరిక మేరకు రొయ్యల కూర వండి సరఫరా చేస్తున్నారు. దీనికి కూడా ఆదరణ లభించడంతో సాయంత్రం సమయంలో ఫిష్‌, రొయ్యల వేపుడు విక్రయిస్తున్నారు. ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఫిష్‌, రొయ్యల బిరియానీ తయారు చేసి రూ.100 నుంచి రూ.150లకు విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆర్డర్‌ ఇస్తే ఇంటి వద్దకే సరఫరా చేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది.

సాఫీగా చదువులు
తోటమ్మ కుమార్తెలు విజయలక్ష్మి, సుగుణలు వ్యా పారంలో తల్లికి సహకరిస్తూనే చదువుల్లో రాణిస్తున్నారు. భర్త రామారావు షాపులో విక్రయించేందుకు జిల్లాలోని పలువురు మత్స్య కారుల నుంచి చేపలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు.

Advertisement
Advertisement