అమిత్‌ షా జోక్యంతో లైన్‌ క్లియర్‌.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌ | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా జోక్యంతో లైన్‌ క్లియర్‌.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌

Published Sat, Oct 7 2023 2:55 PM

Casino Chikoti praveen Joins In BJP In DK Aruna Present Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినో కింగ్‌గా అందరి దృష్టిలో నిలిచిన చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ బీజేపీలో చేరారు.  బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటివెళ్లి పార్టీలో చేరారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చీకోటి ప్రవీణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కాగా చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఓ ఒక క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్‌ అవుతుంది: హరీష్‌ రావు

కిషన్‌ రెడ్డికి ఇష్టం లేక..
తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి అమిత్‌ షా ఆర్డర్‌ వేశారు. అయితే చీకోటిని బీజేపీలో చేర్చుకోవడం కిషన్‌ రెడ్డికి ఇష్టం లేకపోవడంతో డీకే అరుణ సమక్షంలో చేరారు.

కేసీఆర్‌ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయోద్దు
ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా ముందు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్‌ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. 

ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి
‘బావ బావమరుదులు ఆదరాబాదరాగా పనులు పూర్తికాకుండానే తెళ్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తురాలేదా?. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా... సీఎం కావాలనే ఆరాటంలోనే కేటీఆర్ ఉన్నారు. దొంగ నోటిఫికేషన్లు వేసి.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారు.  ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంటే తనకేంటి అన్నట్లు కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారు. పెద్దాయనను ఫాంహౌజ్‌లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టుగా కేటీఆర్, హరీష్ పరిగెత్తుతున్నారు. వారి ఉరుకులాట సీఎం పదవి కోసమే. ఎన్నికల గిమ్మిక్కులను ప్రజలు నమ్మొద్దు’ అని అన్నారు.

Advertisement
Advertisement