Heavy Rains Across Telangana, IMD Issues Alert: Live Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణలో వరద బీభత్సం.. నీట మునిగిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Thu, Jul 27 2023 8:38 AM

Heavy Rains Across Telangana Live Updates - Sakshi

Updates..

►భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి.
► గురువారం రాత్రి 7 గంటలకు  భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ  ప్రమాద హెచ్చరిక 
►ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి.
►దిగువకు 11లక్షల 50వేల క్యుసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల.
►ఏ సమయంలోనైన గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు.

ప్రమాదకరంగా మున్నేరు నది
ఖమ్మం నగరంలో మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.  దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లోకి వరదనీరు చేరింది. మున్నేరు వద్దకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. NDRFతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పద్మావతి నగర్ వరద లో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి.

మీడియాతో మంత్రి పువ్వాడ
ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులు కాపాడినట్లు మంత్రి అజయ్‌ కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతోనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఇక్కడికి పిలిపించామని.. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేపించి పునరావస కేంద్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నారని ఫోన్లు వస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న అందరిని కాపాడే బాధ్యత తమదేన్నారు. 

పెద్దపల్లి జిల్లా.

►పార్వతి బ్యారేజ్‌లోకి కొనసాగుతున్న భారీ వరద నీరు.
►మొత్తం 74 గేట్లు కాగా అందులో 70 గేట్లు ఎత్తిన అధికారులు.
►ఇన్ ఫ్లో 5,90,256 క్యూసెక్కుల 
►ఔట్ ప్లో 5,90,256 క్యూసెక్కుల 
►బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు.
►ప్రస్తుత నీటి సామర్థ్యం : నిల్

రాజన్న సిరిసిల్ల జిల్లా

►గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి వరద నీరు
►ఇన్ ఫ్లో 29781 క్యూసెక్కులు.
►ఔట్ ప్లో 29781  క్యూసెక్కులు.
►ప్రాజెక్ట్ సామర్థ్యం 2.20 టీఎంసీలు.                          
►ప్రస్తుత నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు.

తెలంగాణలో అసాధారణ వర్షపాతం
►తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్
►వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

►భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్‌ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. 

నీట మునిగిన వరంగల్‌
►భారీ వర్షాలతో నీట మునిగిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌
► పూర్తిగా తెగిపోయిన వరంగల్‌-హన్మకొండ కనెక్టివిటీ
►శివనగర్‌ బస్తీల్లో పారుతున్న వరద నీరు

► వరంగల్‌లో పూర్తిగా నీట మునిగిన హంటర్‌ రోడ్డు, నయూం నగర్‌, శివనగర్‌
► బిల్డింగ్‌లపై తలదాచుకున్న వరద బాధితులు
►హంటర్‌ రోడ్డుకు చేరుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది
►సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు
►వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

పట్టాలపై వరద.. పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌
►పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో మూడు గంటలకుపైగా గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. పట్టాలపై భారీగా వరదనీరు చేరడంతో సికింద్రాబాద్‌కు రావాల్సిన రైలును పెద్దపల్లిలో అధికారులు నిలిపేశారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపవేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  అయితే ప్రయాణికులు వాహనాల్లో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఖమ్మం జిల్లా
► భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వరదల్లో  ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నగరంలోని పద్మావతి నగర్‌లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురుని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అయితే వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. 

►మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

►సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరారు.  విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని  ఖమ్మం అధికారులు ఆరాతీస్తున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. .ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద గరిష్టంగా 28 అడుగులు ప్రవహిస్తున్న మున్నేరు వరద ఉధృతిని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు.

వరద ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటన
►రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్‌ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్‌ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో  మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. 

సీఎం కేసీఆర్‌ సమీక్ష..
► తెలంగాణలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితిని కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని కేసీఆర్‌ ఆదేశించారు. వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామించాలని ఆదేశాలు జారీ చేశారు. 

►  తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8మిమీ వర్షం కురిసింది. అంతకుముందు.. ములుగు జిల్లా వాజేడులో 2013లో జూలై 19న 24 గంటల్లో 517.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. 

►  ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదైంది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది.

► హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటలు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 

► ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంపీ హై అలర్ట్‌. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 

► కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 11 సెం.మీల వర్షపాతం నమోదైంది. 

► బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

► తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 21 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. ఇక, హైదరాబాద్‌లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. 

► భద్రాచలం వద్ద 51 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 

హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన జంక్షన్లలో రోడ్లు జలమయమయ్యాయి. మరో​ మూడు గంటలపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌: 040-2111 1111, ఆర్డీఎఫ్‌ నెంబర్‌: 90001 13667.

► భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. భద్రాచలం నుంచి దిగువకు 12.65 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. నీటమునిగిన అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్‌. చర్లలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం పట్టణంలోని 3 కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. అత్యవసరమైతే ఫొటోలు, లోకేషన్లు పంపాలని జిల్లా ఎస్పీ సూచన. పోలీసు రెస్య్కూ కంట్రోల్‌ వాట్సాప్‌ నెంబర్‌ 87126 82128. 

► మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ఇన్‌ఫ్లో 19వేలు, ఔట్‌ఫ్లో 17వేలు క్యూసెక్కులు. 

► నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌ డేంజర్‌ జోన్‌లో ఉంది. సామర్ధ్యానికి మించి వరద ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్‌ సామర్థ్యం 3.50లక్షల క్యూసెక్కులే. కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్‌ గేట్లపై నుంచి వరద ‍ప్రవహిస్తోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

► ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. 

► వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు.  మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాతావరణ శాఖ రెండు రోజులపాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. 

Advertisement
Advertisement