రెండ్రోజులుగా చెట్టుపైనే మృతదేహం 

8 Dec, 2020 08:01 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న అధికారులు

మృతదేహాన్ని కిందికి దించకుండా పట్టుబట్టిన గ్రామస్తులు

ఇరుకుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌

ఓ మహిళ హత్య కేసులో గంగాధర్‌ను అనుమానితుడిగా తీసుకెళ్లిన పోలీసులు 

సాక్షి, సిరికొండ: నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగాధర్‌ మృతదేహం రెండ్రోజులుగా చెట్టు పైనే ఉంది. గత అక్టోబర్‌లో గ్రామానికి చెందిన మమత హత్య కేసులో గంగాధర్‌ను అనుమానితుడిగా భావించి పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు, మహిళలు ఆరోపిస్తున్నారు. గంగాధర్‌ ఆత్మహత్యకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని, మమత హత్య కేసులో అసలైన నిందితులను తక్షణం పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. చదవండి: ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి!

ఇరు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, గంగాధర్‌ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. శవాన్ని చెట్టుపై నుంచి దించేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకున్నారు. వారితో మాట్లాడటానికి వచ్చిన నిజామాబాద్‌ ఆర్డీవో రవిని ఆదివారం రాత్రి వరకు అక్కడే అడ్డుకున్నారు. తగిన న్యాయం జరిగేంత వరకు చెట్టుకు వేలాడుతున్న మృతదేహన్ని కిందకు దించనిచ్చేది లేదని వారు పట్టుబట్టారు. చదవండి: అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

మరిన్ని వార్తలు