పల్లె జీవితాలపై పిడుగు.. | Sakshi
Sakshi News home page

పల్లె జీవితాలపై పిడుగు..

Published Wed, Sep 13 2023 1:52 AM

Significant increase in number of thunderstorms in Telangana - Sakshi

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి :  ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి.  తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 మంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు.

ప్రతి ఏటా మే నుంచి అక్టోబర్‌ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాల్లోనే లక్షకు పైగా పిడుగులు పడుతున్నట్లు భారత లైటనింగ్‌ రిపోర్ట్‌ 2022–23 తాజా నివేదిక వెల్లడించింది. అయితే పిడుగుపాటు మరణాలు జాతీయ విపత్తు జాబితాలో లేకపోవటంతో మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం అందడం లేదు. పరిహారం అందించే అంశం అధికారులు, ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటోంది. దీంతో బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి నెలకొంది. 

ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాల్లో ఏటా సగటున లక్షకు పైగా పిడుగులు

పొట్టకూటి కోసం మిరపనారు నాటేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలను పిడుగు కబళించింది. మిరప నారు నాటుతుండగా ఉన్నట్టుండి పిడుగు పడింది. మరుక్షణంలోనే చిలివేరు సరిత (30), నేర్పాటి మమత (32) మృత్యువాత పడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్‌ శివా రులో గత మంగళవారం ఈ పిడుగు పాటు సంభవించింది. ఆ ఇద్దరు మహి ళల కుటుంబాల్లో చీకట్లు నింపింది.


పిడుగుపాటు జీవితాల్ని ఎలా ఛిద్రం చేస్తుందో చెప్పే చిత్రమిది. 2021 సెప్టెంబర్‌ 3న ఆసిఫాబాద్‌ మండలం కౌటాల పరి«­దిలోని ముత్తంపేటలో పున్నయ్య (52), పద్మ (40), శ్వేత పత్తి చేనులో పను­లు ముగించుకుని ఎడ్లబండి­పై ఇంటి­బాట పట్టారు. ఇంతలో ఉరు ము­­లు, మెరుపులతో వర్షం మొదలైంది. అకస్మా­త్తుగా ఓ పిడుగు నిప్పులు కురి పిం­­చింది. అంతే బండెద్దులతో పాటు పున్న­­­య్య, పద్మ, శ్వేత అక్కడి కక్కడే దు­ర్మరణం పాలయ్యారు. ప్రకృతి పగబ­ట్టిన ఈ ఘటనలో విపత్తు సాయం నయా పైసా కూడా బాధిత కుటుంబాలకు అందలేదు.

సాంకేతికత వినియోగంలో విఫలం..
 పిడుగుపాటు మరణాలు భారీగా పెరుగుతున్నా జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు కనీస చొరవ తీసుకోవటం లేదని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి పిడుగులు పడే సమాచారాన్ని ముందే పసిగట్టే సాంకేతికతను (లైటనింగ్‌ డిటెక్షన్‌ నెట్‌వర్క్‌) ఐఐటీ మహారాష్ట్ర ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీంతో 20 నుంచి 40 కి.మీ. పరిధిలో పిడుగుపడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయొచ్చు.

ఒడిశా, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు అందివచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ వివిధ మాధ్యమాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గినట్లు లైటనింగ్‌ రెసిలెంట్‌ ఇండియా సంస్థ పేర్కొంది. 

పిడుగుల వాన..పిల్లల చదువుకు బ్రేక్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ పరిధిలోని పెద్దవార్వాల్‌కు చెందిన కటిక బాలరాజ్‌(52) ఈ ఏడాది జూన్‌ 11న రోజు మాదిరిగానే భార్య జమునతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన పిడుగుల వర్షంతో 30 మేకలు సహా బాలరాజ్‌ అక్కడికక్కడే చనిపోగా, జమున తీవ్ర అస్వస్థతకు గురైంది. తండ్రి మరణంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కూతుళ్లు గౌరేశ్వరి (డిగ్రీ), చందన (ఇంటర్‌) చదువులు ఆకస్మికంగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది.

14వ స్థానంలో తెలంగాణ
మేఘం నుంచి భూమిపై (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) పడే పిడుగుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. 2022–23లో అత్యధి కంగా మధ్యప్రదేశ్‌ 9,41,663 పిడుగు లతో దేశంలో మొదటి స్థానంలోలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (6,85,893), ఛత్తీస్‌గఢ్‌ (5,16,504) ఉన్నాయి. తెలంగాణ (2,19,477) ఈ జాబితాలో 14వ స్థానంలో ఉంది.

జాతీయ విపత్తులుగా పరిగణించాలి..  
పిడుగుపాటుతో అత్యధికంగా మరణిస్తున్నది రైతు కూలీ లే. దేశంలో పిడుగుపాటు మరణాలు పెరిగిపో తున్న తీరు ఆందోళనకరంగా మారింది. పిడుగుపాట్లను జాతీయ విప త్తులుగా పరిగణించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. పిడుగులు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించేందుకు, ఆపై ప్రచారం చేసేందుకు కావాల్సిన సాంకేతికత ఇప్పుడు ఆందుబాటులో ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఏటా వందల మరణాలు చోటుచేసుకుంటుండటం దురదృష్టకరం.  – కల్నల్‌ సంజయ్‌ శ్రీవాత్సవ, లైటనింగ్‌ రెసిలియెంట్‌ ఇండియా, న్యూఢిల్లీ

త్వరలో కార్యాచరణ మొదలుపెడతాం
తెలంగాణలోనూ పిడుగుపాటు మరణా లు సంభవిస్తున్నాయి. దీనిపై త్వరలో కా ర్యాచరణ మొదలుపెడతాం. సాంకేతికత ను ఎలా ఉపయోగించుకోవాలి, యంత్రాంగాన్ని ఏ మేరకు సిద్ధం చేయాలన్న అంశంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పిడుగు పాటు మరణాలు, నష్టాలను కూడా జాతీయ విపత్తు జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరతాం. – బి.వినోద్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement