Telangana High Court Key Orders on Omicron Variant - Sakshi
Sakshi News home page

Telangana High Court-Omicron: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Published Fri, Dec 31 2021 12:28 PM

Telangana High Court Key Orders on Omicron Variant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగింది. ఈ పిటిషన్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్స్‌ కోర్టుకు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదన్న పిటిషనర్స్ కోర్టుకు తెలియజేశారు. 

హైకోర్టు కీలక ఆదేశాలు
శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు ఒమిక్రాన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఒమిట్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టుకు సబ్మిట్ చేయాలని కోరింది. తదుపరి విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది. 

చదవండి: (రెండో ప్రమాద హెచ్చరిక.. మూడో వేవ్‌ వచ్చేసింది.. ఆ 4 వారాలే కీలకం)

Advertisement
Advertisement