చట్టానికి అందరూ సమానులే | Sakshi
Sakshi News home page

చట్టానికి అందరూ సమానులే

Published Fri, Nov 10 2023 4:44 AM

ఆత్మకూర్‌లో మాట్లాడుతున్న న్యాయమూర్తి శిరీష  - Sakshi

వనపర్తిటౌన్‌: చట్టానికి ధనవంతులు, పేదలు, చిన్న, పెద్ద అనే తేడాలుండవని.. అందరూ సమానులేనని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత అన్నారు. జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోకి న్యాయస్థానం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం, ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో లోక్‌ అదాలత్‌ సంస్థ పేదలకు ఉచిత న్యాయసేవలు అందిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రజని, న్యాయమూర్తులు రవికుమార్‌, జానకి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్‌కుమార్‌, కార్యదర్శి కృష్ణయ్య, న్యాయవాదులు బాలనాగయ్య, ఉత్తరయ్య, శ్రీదేవి, జయలక్ష్మి, రఘు, గోపాల్‌రెడ్డి, బాలయ్య, భరత్‌, యాదగిరి, శంకర్‌, తిరుపతయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కలిగి ఉండాలి..

ఆత్మకూర్‌: చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆత్మకూర్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.శిరీష కోరారు. జాతీయ న్యాయసేవా దినోత్సవంలో భాగంగా గురువారం స్థానిక శ్రీవాణి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాల గురించి వివరించారు. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదని.. అందరికి సమానమే అన్నారు. బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, ట్రాఫిక్‌ నిబంధనలు, సివిల్‌, క్రిమినల్‌ చట్టాలు, న్యాయశాస్త్రం, ర్యాగింగ్‌ తదితర అంశాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వై.తిప్పారెడ్డి, దివాన్జీ అశోక్‌రావు, నారాయణగౌడ్‌, జీకే రాములు, ముక్తేశ్వర్‌, పాఠశాల అడ్వైజర్‌ టీజే విశ్వేశ్వర్‌, ప్రిన్సిపల్‌ గంగాధర్‌, హెచ్‌ఎం లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత

వనపర్తిలో ర్యాలీ నిర్వహిస్తున్న 
న్యాయమూర్తులు, న్యాయవాదులు
1/1

వనపర్తిలో ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు

Advertisement
Advertisement