బంగ్లా మహిళలకు ప్రత్యేక శిక్షణ | Sakshi
Sakshi News home page

బంగ్లా మహిళలకు ప్రత్యేక శిక్షణ

Published Fri, Mar 10 2023 12:32 AM

- - Sakshi

తాడేపల్లిగూడెం: తొలి అంతర్జాతీయ శిక్షణకు వేదికగా మారిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిఽధిలోని కేవీకేలో బంగ్లా మహిళలకు గురువారం ఎండుపూలతో, ఆకులతో కళాకృతులు తయారు చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సొసైటీ ఫర్‌ బ్రైట్‌ సోషల్‌ సర్వీసెస్‌ సంస్థ, షేర్‌ ఏ బంగ్లా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడకు వచ్చిన పది మంది బృందంలోని సభ్యులకు శిక్షణ కొనసాగింది. కట్‌ ఫ్లవర్‌ విభాగంలో ప్రాసెసింగ్‌, ఉత్పత్తుల తయారీ, చామంతి, జర్బరా, రోజ్‌, బంతి, తూజ ఆకులను ఎండబెట్టే పద్దతులు, ప్రెస్సింగ్‌ విధానాల గురించి వివరించారు. ఎండినపూలు, ఆకులతో గ్రీటింగ్‌ కార్డులు, తయారు చేయించారు. వీసీ టి.జానకీరామ్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది.

Advertisement
Advertisement