టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టింది టీడీపీనే | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టింది టీడీపీనే

Published Thu, Nov 16 2023 12:54 AM

గోపీని అడ్డుకుంటున్న పోలీసులు  - Sakshi

పాలకొల్లు అర్బన్‌: టిడ్కో లబ్ధిదారులను గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎలా మోసం చేశారో లబ్ధిదారులకు వాస్తవాలను వివరిస్తామని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో పాలకొల్లు టిడ్కో గృహాల సముదాయంలో బుధవారం చేపట్టిన వంట వార్పుకి దీటుగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి నాయకత్వంలో వాస్తవాల వడ్డన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా గుడాల గోపి విలేకరులతో మాట్లాడుతూ ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడానికి ఎమ్మెల్యే నిమ్మల చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే నిమ్మల చదువుకున్న మూర్ఖుడని, టిడ్కో గృహాలను టీడీపీ హయాంలో బ్యాంకులకు తాకట్టు పెడితే.. సీఎం జగన్‌ బ్యాంకులకు తాకట్టు పె ట్టారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాయితీగా పనిచేయడం తమకు అలవాటని, నిజాలను సైతం అబద్ధాలుగా చిత్రీకరించడంలో ఎమ్మెల్యే నిమ్మల పీహెచ్‌డీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో పేదలకు ఇంటి పట్టాలివ్వాలని పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో 52 ఎకరాలు కొనుగోలు చేశారని, అయితే 2014–19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉండగా టిడ్కో గృహాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. చదరపు అడుగుకి రూ.950కు పనులు చేయడానికి ప్రముఖ కంపెనీ ముందుకు వస్తే చంద్రబాబు, ఎమ్మెల్యే నిమ్మల కమీషన్లకు కక్కుర్తిపడి ఎల్‌ అండ్‌ టీ సంస్థకి చదరపు అడుగుకి రూ.2,150 అప్పగించారని ఆరోపించారు. 20 ఏళ్ల పాటు లబ్ధిదారుల గృహాలను 11 బ్యాంకులకు తాకట్టు పెట్టారని గోపి దుయ్యబట్టారు.

వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి గుడాల గోపి

Advertisement
Advertisement