35 ఏళ్ల తర్వాత ఆ ఏనుగుకు విముక్తి!

30 Nov, 2020 14:41 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు గుంపుతో తిరిగే అవకాశం దొరికింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. ఇంతకాలం  ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగైన కావన్‌ ఇకపై ఏనుగులతో జూలో ఉండనుంది. కావన్‌ను విమానంలో తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది.  చదవండి:  (అతి భారీ వర్షాలు: 2న రెడ్‌ అలర్ట్)

శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చేర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురూ కావన్‌ను తరలించడానికి అంగీకరించారు. అనంతరం కావన్‌ను కాంబోడియాకు పంపేందుకు సహాయపడిన ఇమ్రాన్‌కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు చేర్‌. మరోపక్క కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్‌కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే పర్యావరణ కార్యక్రమాల్లో చేర్ పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు పీఎంఓ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌కు తరలించనున్నారు.

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా