బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన | Sakshi
Sakshi News home page

బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన

Published Tue, Mar 7 2017 5:11 PM

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా వాన పడటంతో రోడ్లపై ఉన్న జనం తలదాచుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. అరగంట పాటు కురిసిన వానతో మండల కేంద్రంలో తెల్లటి మంచు కప్పినట్లయింది.