Sakshi News home page

'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'

Published Thu, Jul 23 2015 3:16 PM

న్యూఢిల్లీ: జీవితఖైదు శిక్ష పడిన ఖైదీలకు ఆయా రాష్ట్రాలు కావాలనుకుంటే క్షమాభిక్ష ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. రాజీవ్ గాంధీ హంతకుల కేసును విచారించే సందర్భంగా కోర్టు గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వొచ్చని తెలిపింది. అయితే.. జీవితాంతం శిక్ష అనుభవించాలని ఇచ్చిన తీర్పులలో మాత్రం క్షమాభిక్ష వర్తించబోదని స్పష్టం చేసింది. అలాగే నిర్ధారిత కాలం పాటు తప్పనిసరిగా జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చిన సందర్భాలలో కూడా క్షమాభిక్ష ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయకుండా, రాష్ట్రానికి చెందిన సిట్ లాంటివి దర్యాప్తు చేస్తే క్షమాభిక్ష ఇవ్వచ్చని తెలిపింది. అత్యాచారం, హత్య లాంటి నేరాలు కాకుండా ఇతర ఐపీసీ సెక్షన్ల కింద శిక్షలు పడినప్పుడు కూడా క్షమాభిక్ష ఇవ్వచ్చని వివరించింది. అయితే.. ప్రస్తుత ఉత్తర్వులు రాజీవ్ గాంధీ హత్యకేసుకు వర్తించదని, ఈ కేసు ప్రస్తుతం ఇంకా విచారణలోనే ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement