దుబ్బాక చేనేత సొసైటీలో సమంత సందడి | Sakshi
Sakshi News home page

దుబ్బాక చేనేత సొసైటీలో సమంత సందడి

Published Fri, Mar 10 2017 6:33 PM

తెలంగాణ రాష్ట్ర చేనేత అంబాసిడర్, ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్‌ సమంత శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకార సంఘంలో సందడి చేశారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను ఆమె పరిశీలించి మార్కెటింగ్, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు. మగ్గాల మీద కూర్చున్న కార్మికులు, కండెలు చుట్టే మహిళా కార్మికులతో ఆమె కాసేపు ముచ్చటించారు. సంఘంలో తయారు చేస్తున్న చేతి రుమాలు, టవల్స్, ఇతర వస్త్రాలను చూసిన సమంత బాగున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement