-
సిద్దిపేటలో ‘సమంత’ సందడి
గొల్లభామ చీరల పరిశీలన ⇒ ఈ డిజైన్‌ను డ్రెస్ మెటీరియల్‌కు అన్వయించాలని సూచన ⇒ చేనేత కార్మికులతో మాటామంతీ ⇒ డబ్బులు, ఆర్డర్లు మావి..పని మీదంటూ భరోసా సిద్దిపేట జోన్/దుబ్బాక: ప్రముఖ సినీనటి, తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత శుక్రవారం సిద్దిపేటలో సందడి చేశారు. పట్టణంలోని పలు చేనేత సహకార సం ఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు. తెలంగాణకే తలమానికంలా నిలిచిన ‘గొల్లభామ’ చీరల ప్రత్యేకతను, కార్మికుడి పని తనం గురించి అడిగి తెలుసుకున్నారు. ముం దుగా ఆదర్శ చేనేత సహకార సంఘం పరి«ధి లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు, ఇక్కడ తయారయ్యే వస్త్రాల వివరాలను తెలుసుకున్నారు. మహిళలు వినియోగించే స్టోన్స్, పురుషుల కోసం తయారు చేసిన కాటన్ షర్టులను కొనుగోలు చేశారు. అనంతరం చేనేత కార్మికుడు తుమ్మ గాలయ్య ఇంటికి వెళ్లి గొల్లభామ చీరలు, కాటన్ చీరలను పరిశీలిం చారు. అక్కడ రెండు గొల్లభామ చీరలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వీరారెడ్డిపల్లి సొసైటీని సందర్శించారు. డిజైన్ అన్వయిస్తే అదృష్టమే.. గొల్లభామ డిజైన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇదే పనితనాన్ని చేనేత కార్మికులు డ్రెస్ మెటీరియల్‌కు అన్వయిస్తే కార్మికులకు అదృష్టం పట్టుకుంటుందని సమంత పేర్కొన్నారు. గొల్లభామ డిజైన్‌ను, చీరల నైపుణ్యత చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే డిజైన్‌ను డ్రెస్ మెటీరియల్ మీద అందించడానికి కార్మికులు ముందుకు వస్తే చేనేత పరిశ్రమ అభివృద్ధి సంస్థ పక్షాన పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులకు సూచించారు. ఇందుకు కార్మికులు సుముఖత వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు రవికుమార్ తదితరులు ఉన్నారు. దుబ్బాక చేనేత సంఘంలో.. అనంతరం హీరోయిన్ సమంత దుబ్బాక చేనేత సహకార సంఘానికి చేరుకున్నారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. మగ్గాల మీద కూర్చున్న కార్మికులు, కండెలు చుట్టే మహిళలతో కాసేపు ముచ్చటించారు. సంఘంలో తయారు చేస్తున్న చేతి రుమాలు, టవల్స్, ఇతర వస్త్రాలను చూసిన సమంత బాగున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు. కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాల మార్కెటింగ్ కోసం వ్యక్తిగతంగా ఆర్డర్లను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. శాంపిల్ కోసం కార్మికులిచ్చిన చేతి రుమాలు, లెనిన్ వస్త్రాలను తన వెంట తీసుకెళ్లారు. -
దుబ్బాక చేనేత సొసైటీలో సమంత సందడి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement