ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ

Published Tue, Oct 14 2014 5:59 PM

తుఫాను కారణంగా రైల్వేలైన్లు దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. యలమంచిలి వద్ద సింగిల్ ట్రాకు మరమ్మతులు చేయడంతో ఇది సాధ్యమైంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ బయల్దేరుతుంది. అలాగే హౌరా- యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్ - ముంబై ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు - డిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. అయితే కొన్ని రైళ్లు మాత్రం రద్దయ్యాయి. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం కూడా రద్దయింది. షాలిమార్ - చెన్నై ఎక్స్ప్రెస్ రద్దయింది. సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ రైలు రద్దయింది. విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట వరకే పరిమితం చేశారు. అలాగే విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట నుంచే నడిపిస్తున్నారు.

Advertisement
Advertisement