సిరియా శరణార్థులకు ట్రంప్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

సిరియా శరణార్థులకు ట్రంప్‌ షాక్‌

Published Sun, Jan 29 2017 7:38 AM

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల్ని అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శనివారం సంతకం చేశారు. ఉత్తర్వు ప్రకారం అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశాన్ని నిరవధికంగా నిషేధించారు. ఇతర దేశాల శరణార్థుల్ని ఆసాంతం పరిశీలించాకే అనుమతిస్తారు. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు.