Sakshi News home page

అనంతపురం జిల్లాలో 40వ రోజు ఆందోళనలు

Published Sun, Sep 8 2013 8:43 AM

40th day agitation in Anantapur District

అనంతపురం: జిల్లాలో  సమైక్యాంధ్ర  ఆందోళనలు 40వ రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటించిన రోజు నుంచి ఈ జిల్లాలో ఆందోళలను ఉధృతమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి నిరంతరాయంగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ దీక్షలు చేస్తున్నారు.

జాక్టో,జెడ్పీ, ఏపీఎన్జీవో, రెవెన్యూ, విద్యుత్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అనంతపురంలో ముస్లింలు  శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసి బస్సులు తిరగనందున  38 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

Advertisement

What’s your opinion

Advertisement