Sakshi News home page

మూడు పాదయాత్రల్లో పాల్గొన్నా..

Published Tue, Jan 8 2019 8:27 AM

Duvvada Srinivas in YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్‌: 2003లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాల్లో కోటబొమ్మాళి మండలం చల్లపేట నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచాను. ఆయన అధికారంలోకి వచ్చిన అనంతరం జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజలతో మమేకమై సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోనే ఆదర్శ పాలన సాగించేందుకు దోహదపడుతుంది.

జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రలో సైతం పాల్గొన్నాను. జగన్‌ పాదయాత్ర ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపింది. జన్మభూమి కమిటీల అక్రమాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేశారు. 612 హామీలు చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చారు. ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు. ఇచ్ఛాపురంలో వైఎస్‌ కుంటుంబానికి సంబంధించి మూడు పైలాన్లు ఏర్పాటు చేయనున్న సందర్భం చరిత్రలో చెప్పుకోదగ్గది. పాదయాత్ర స్ఫూర్తితో జిల్లాలో పార్లమెంట్‌ నియోజకవర్గం, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుంది. మరో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పాలన వస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement