Sakshi News home page

గ్రీన్‌ఫీల్డా.. అయితే ఓకే!

Published Mon, Dec 22 2014 1:59 AM

గ్రీన్‌ఫీల్డా.. అయితే ఓకే!

గ్రీన్‌జోన్‌ను స్వాగతిస్తున్న కొందరు జరీబు రైతులు
ప్యాకేజీలకైతే వెనుకంజ కొత్త రాజధానిలో సరికొత్త చర్చ


విజయవాడ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నా 30శాతం భూమిని మొక్కల పెంపకానికి కేటాయించాలి. నగరాల్లో ఉన్న వాహన కాలుష్యం, ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రీనరీ ఎంత పెంచాలనే విషయూన్ని నిర్ణరుుస్తారు. విజయవాడలో కనీసం 20 శాతం మేర గ్రీనరీ ఉండాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, బెంగళూరు, నయారాయపూర్ తదితర నగరాలను గ్రీన్‌ఫీల్డ్ జోన్లుగా ప్రకటించి 30శాతం వరకు గ్రీనరీని అభివృద్ధి చేశారు. తాజాగా తుళ్లూరునూ గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూడా 33 శాతం గ్రీనరీ ఉంటే బాగుంటుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
 
తెరపైకి జరీబు భూములు

రాజధాని నేపథ్యంలో తుళ్లూరు మండలంలో తొలి విడత సేకరించే 30వేల ఎకరాల భూముల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల జరీబు భూములే (కృష్ణాతీర ప్రాంతంలోని, ఏటిగట్టు ప్రాంతంలోని భూములు) ఉన్నారుు. ఈ ప్రాంతాన్ని గ్రీన్‌ఫీల్డ్ జోన్‌గా ప్రకటిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భూముల్లో ఏడాదికి నాలుగు పంటలు పండుతాయి కాబట్టి ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. దీనిని గ్రీన్‌బెల్ట్‌గా నిర్ణయిస్తే గట్లపైన, నది ఒడ్డున కూడా పెద్దపెద్ద వృక్షాలు పెంచే అవకాశం ఉంటుంది. అవసరమనుకుంటే ప్రభుత్వం రైతులతో కమిటీలు వేసి వీటి ఆధ్వర్యంలోనే గ్రీన్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయవచ్చని రైతులు అంటున్నారు. దీనివల్ల భూములు తమ చేతులు దాటిపోవని, తాము పంటలు పండించుకుంటూనే కొత్త రాజధానిని పచ్చగా తీర్చిదిద్దుతామని మందడం గ్రామానికి చెందిన రైతు ఎ.ప్రసాద్ తెలిపారు.
 
చంద్రబాబు అంగీకరిస్తారా?
 
వాస్తు ప్రకారం.. కృష్ణానది పక్కనే తుళ్లూరులో రాజధాని నిర్మించాలని సీఎం భావిస్తున్నారు. అందువల్ల జరీబు భూముల్ని ఆయన వదిలి పెట్టరనే భావన కొందరు రైతుల్లో వ్యక్తమవుతోంది. రాజధానిలో నిర్మించే విశాలమైన రోడ్ల పక్కనే మొక్కలు పెంచి గ్రీన్‌ఫీల్డ్ జోన్‌గా ప్రకటిస్తారే తప్ప జరీబు భూముల్ని అలా ప్రకటించకపోవచ్చని కొందరు రైతుల మరో వాదన.
 
అసలు  కథ ఇదీ..

 
ఒకవేళ ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి జరీబు భూములు తీసుకుంటే రైతులు తీవ్రంగా  నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వ ప్యాకేజీ కంటే జరీబు భూముల ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఎకరం జరీబు భూమి రూ.2కోట్లు ఉంటే.. ప్రభుత్వ ప్యాకేజీ కింద వచ్చేది రూ.1.50కోట్లే. దీంతో కొందరు జరీబు భూయజమానులు ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా తుళ్లూరును  గ్రీన్‌ఫీల్డ్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జరీబు భూములను అందుకు వినియోగించాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల భూమి తమవద్దే ఉంటుందనేది వారి వాదన.
 
 

Advertisement

What’s your opinion

Advertisement