Sakshi News home page

జీవన విషాదం

Published Fri, Sep 27 2013 2:57 AM

Life Tragedy in Hyderabad

ఇదేదో మాయ కాదు.. మంత్రం కాదు. ఆకలి తీర్చుకునే పోరాటంలో బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేస్తున్న సజీవ ‘సాక్ష్యం’.

వీక్షకుల వొళ్లు జలదరింపజేసేలా పదేళ్ల వయసు గల చిన్నారి గొంతుపై ఇతడు చేస్తున్న ఈ విన్యాసం గురువారం ఖైరతాబాద్‌ ప్రాంతంలో సాక్షి కెమేరాకు చిక్కింది.

కన్నవారి కడుపు నింపేందుకు ఆ బాలిక అనంతమైన బాధను గొంతులోనే అణచుకుంటున్న దృశ్యాన్ని చూసిన వారెవరైనా చలించిపోవాల్సిందే.

ఆ చిన్నారికి ఎందుకంత కష్టమనే ప్రశ్న కూడా వస్తుంది. పాలకుల నిర్లక్ష్యం కొనసాగున్నంత కాలం ఇలాంటి వారి  ఆకలి కష్టాలు తీరవనడానికి ఇదే ప్రబల సాక్ష్యం.

-ఫొటో: ఆర్‌.లావణ్యకుమార్‌, హైదరాబాద్‌

Advertisement

What’s your opinion

Advertisement