Sakshi News home page

పాశం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి

Published Sun, Apr 10 2016 5:09 AM

పాశం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి - Sakshi

గూడూరు: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి మారడం అనైతిక చర్యని, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తన శాసన సభ్యత్వానికి రాజీ నామా చేయాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్య శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్న నియోజకవర్గ ప్రజలు సునీల్‌కుమార్‌కు ఓట్లేసి గెలిపిం చారని, ఇప్పుడు ఆయన పార్టీ మారడం అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంత ముఖ్యమో, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కూడా నాయకులకు శిరోధార్యమన్నా రు. ఆయన పార్టీ మారాలంటే ముందుగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున పోటీ చేసి ఉంటే నియోజకవర్గ ప్రజలు హర్షించేవారన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement