ఇక ప్రతి వారం తనిఖీలు: కలెక్టర్ | Sakshi
Sakshi News home page

ఇక ప్రతి వారం తనిఖీలు: కలెక్టర్

Published Sat, Aug 17 2013 12:48 AM

No longer checks every week: Collector

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి వారం తనిఖీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బి.శ్రీధర్ టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాల్లో నిర్దేశిత కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేసేందుకుగాను శుక్రవారం తనిఖీ బృందాలను నియమించారు. అనంతరం కలెక్టరేట్‌లో వారితో సమావేశం నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ బృందాలకు కేటాయించిన మండలాల్లోని అధికారుల వివరాలు సేకరించి తనిఖీల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, మెప్మా పీడీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
 
 అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కేసులు
 జిల్లాలో అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మైనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కీసర, శామీర్‌పేట్, హయత్‌నగర్, తాండూరు మండలాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఈ ప్రాంతాల్లో వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, దీన్ని నిరోధించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ-1 చంపాలాల్, డీఆర్వో రాములు తదితరులు పాల్గొన్నారు.
 
 పట్టణ భూములపై ప్రత్యేక 
 జిల్లాలోని పట్టణ మండలాల్లోని ప్రభుత్వ భూములపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పట్టణ మండలాల్లోని తహసీల్దార్లు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భూములు తనిఖీ చేయాలని, ఇందుకు సంబంధిత సర్వేయర్లతో సర్వే చేయించి తనకు నివేదిక అందించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో యూఎల్‌సీ ప్రత్యేకాధికారి ఆనందరావు, జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement