Sakshi News home page

కౌలు రైతు బలవన్మరణం

Published Sun, Dec 22 2013 4:29 AM

The number of farmers to lease

ఏదుట్ల (గోపాల్‌పేట), న్యూస్‌లైన్ : ఆ దంపతులు కుల వృత్తినే న మ్ముకుని జీవనం సాగిద్దామనుకున్నా ప రిస్థితులు అనుకూలించలేదు.. దీంతో పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చలేక దిగులు చెందారు.. ఈ క్రమంలోనే భార్య పది రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా భర్త సైతం బలవన్మరణం చెందాడు. దీంతో వారికున్న ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. హృదయ విదారకమైన సం ఘటన వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌పేట మండలం ఏదుట్లకు చెందిన వడ్డె రాజు (36), ఈశ్వరమ్మ దంపతులు వృ త్తిరీత్యా రాళ్ల కొట్టి జీవించేవారు. వీరికి కుమారుడు రాయుడు, కూతురు గంగో త్రి ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో భార్యాభర్తలు ఈ ఏడాది ఆ పనులు మానుకుని కేశంపేట శివారులోని పొట్టిగుట్ట దగ్గర వెంకటయ్యగౌడ్ కు చెందిన తొమ్మిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. అందులో వేరుశనగ పంట వేశారు. దీనికోసం ప్రయివే ట్ వ్యక్తుల వద్ద సుమారు రూ. మూడు లక్షల అప్పు తెచ్చారు. అయితే ఆశించిన దిగుబడి రాకపోవడంతో పది రోజుల క్రిత మే భార్య పొలంలోనే గుళికలమందు తాగి చనిపోయింది. ఆమె మరణం, పం ట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురైన భర్త శుక్రవారం రాత్రి పొలం వద్ద ఏర్పాటు చేసుకున్న గుడిసెలోకి వెళ్లి పురుగుమందు ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 శనివారం ఉ దయం అతని తమ్ముళ్లు కుర్మయ్య, రా ములు అక్కడికి వెళ్లి చూసి బోరుమన్నా రు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేయడంతో ట్రెయినీ ఎస్ఠ్‌ఐ రమేష్, హెడ్‌కాని స్టేబుల్ శ్రీని వాస్‌రెడ్డి సంఘటన స్థలా న్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నా రు. అనంతరం రేవల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. త ల్లిద్రండులను కోల్పోయిన ఆ ఇద్దరు పి ల్లలు అనాథలయ్యారు. అనంతరం బా ధిత కుటుంబాన్ని కేశంపేట, ఏదుట్ల స ర్పంచ్‌లు రాంబాబు, నారాయణ పరామర్శించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
 

Advertisement

What’s your opinion

Advertisement