Sakshi News home page

ఖాళీ బిందెలతో మహిళల బైఠాయింపు

Published Fri, Jul 10 2015 3:08 AM

women strike

అట్లూరు: మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయానికి తాళాలు వేశారు. అట్లూరు గ్రామానికి చెందిన సుమారు వందమంది మహిళలు గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.
 
 నీటి కోసం అల్లాడుతున్నాం. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి, ఆదుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ ఎంపీడీ వో మధుసూదన్‌రెడ్డి చాంబర్‌లోకి వెళ్లి నిల దీశారు. ఆయనను బయటికి పంపించి, కా ర్యాలయానికి తాళాలు వేశారు. అనంతర ం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు ఈశ్వరయ్యను కూడా తాగు నీ టి సమస్యపై నిలదీశారు. అనంతరం తహశీల్దారు కార్యాలం ఎదుట  బైఠాయించారు.  
 
 అక్కడకు చేరుకున్న ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి సర్దుభాటు చేసే యత్నం చేశారు. మేము తాగునీటి కోసం అల్లాడుతున్నాం. మా గ్రామంలోకి ఏరోజైనా వచ్చి సమస్య పరిశీలించారా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
 ఈ విషయం తెలుసుకున్న మండ ల ప్రత్యేకాధికారి రమగోపాల్‌రెడ్డి, ఆర్‌డ బ్ల్యూఎస్ ఏఈ రవితేజా, పీఆర్ ఏఈ శ్రీనువాసులు అక్కడకు చేరుకుని సమస్య పరి ష్కరిస్తామంటూ నచ్చచెప్పి గ్రామంలోకి తీసుకెళ్లారు. మహిళలు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటసుబ్బయ్య, బద్వేలు ఏరియా కార్యదర్శి వీరశేఖర్, జిల్లా సభ్యు లు జకరయ్య, మండల కార్యధర్శి నిత్యపూజయ్య అక్కడకు చేరుకుని మహిళలకు మద్దతుగా నినాదాలు చేశారు.
 

Advertisement

What’s your opinion

Advertisement