శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించ నున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ప్లీనరీని విజవంతం చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాటాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల స్థాయి, జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ప్లీనరీ సమావేశాలను నిర్వహించామని చెప్పారు.
సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసిందన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను, అవినీతి, అన్యాయాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనున్న జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో 10 నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులన్నీ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి జిల్లా పరిశీలకులు కొయ్య మోషేన్‌రాజు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ కిల్లి సుభాష్ చంద్రబోస్‌లు హాజరవుతారని పేర్కొన్నారు. పీఏసీ, సీజీసీ సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్తకార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మాజీ చైర్పర్సన్లు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం విజయవాడలో జూలై 8, 9వ తేదీల్లో జరుగుతుందని, అక్కడికి కూడా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Breadcrumb
28న వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం
Published Sat, Jun 17 2017 10:37 PM
Related news
-
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్‌బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్‌కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్‌తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
రేపు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్ జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్‌ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్‌గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Related News by category
-
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ పచ్చ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్ కాల్స్ పేరుతో జనాలకు ఫోన్లు చేసి విసిగిస్తోంది. ఫోన్ ఎత్తితే చాలు.. సీఎం జగన్‌పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. ఎవరో ఫోన్ చేస్తున్నారనుకుని ఆ ఫోన్ ఎత్తితే చాలు.. ఆ వాయిస్ కాల్లో సీఎం జగన్‌ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్ కాల్స్‌ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్‌పై ట్రూకాలర్‌లో యువర్ జగన్, జగన్ లీడర్, మాస్ లీడర్ జగన్.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్‌ను అభిమానించే వారు ఫోన్లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్‌ఫిలిమ్స్‌తో సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.జగన్‌పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సేద్యంలో సేవలకు సలాం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు, ఉత్తమ విధానాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయడంతో అప్పుల వలయం నుంచి రైతాంగం విముక్తి పొందుతున్నారనీ, ఆర్బీకేలు పారదర్శకంగా ఉంటూ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని కితాబిచ్చింది. వికసిత్ భారత్ దిశగా ప్రోత్సాహానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, ఆచరణలతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం కొత్తగా అమలు చేస్తున్న పథకాలు.. ఉత్తమ విధానాలు, ఆచరణలను ప్రముఖంగా ప్రస్తావించింది. వీటిని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవడానికి, భాగస్వామ్యం చేయడానికి నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొన్న అంశాలివే.. వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు వైఎస్సార్ సున్నా వడ్డీతో రుణ భారం నుంచి రైతులు విముక్తి పొందారు. వారి సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సకాలంలో పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేస్తోంది. వడ్డీ రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులు సకాలంలో రుణాన్ని చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది. పంటలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా రైతుల ప్రయోజనాల కోసం సీఎం వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు.ఈ పథకం కింద రైతుల నమోదును సులభతరం చేయడంతో పాటు కేవలం టోకెన్‌గా ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత పంటల బీమాను వర్తింప చేయడంతో రైతులకు వరంగా మారింది. వాతావరణ మార్పులు, ప్రకతి వైపరీత్యాలు లాంటి సమయాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆయా సీజన్లోనే క్లెయిమ్‌లను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తున్నారు. దీంతోపాటు పంటల భౌతిక ధ్రువీకరణ కూడా రైతులకు అందిస్తోంది. రైతాంగానికి బీమా నమోదు రసీదులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ వీలైనంత సరళంగా, అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా అమలయ్యే తీరు వ్యవసాయ అభివద్ధిని సూచిస్తోంది. రైతు భరోసా అందించే ఏకైక రాష్ట్రం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలను ఏపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. రైతులకు ఆర్థిక సాయం గ్రాంట్‌గా అందిస్తున్నారని తెలిపింది. ఏడాదిలో మూడు విడతల్లో రైతులకు రూ.13,500 చొప్పున అందిస్తున్నారని, సీజన్ ప్రారంభంలో భూమిని సిద్ధం చేసి, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, కూలీల చార్జీల నిమిత్తం రైతులకు ఉపయోగపడేలా ఈ పథకాలను అమలు చేస్తున్నారని నివేదిక వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.8,748 కోట్లు వ్యవసాయంలో ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.8,748 కోట్లు చెల్లిస్తోందని నీతి ఆయోగ్ నివేదికలో తెలిపింది. దీన్ని మరింత పటిష్టపరిచేందుకు వచ్చే 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగించేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందుకోసం అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బిల్లులకు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఉచిత విద్యుత్ బిల్లు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపింది. కేంద్రం సూచించిన సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనుందని, ఈ పథకంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడంతో రైతులపై ఆరి్థక భారాన్ని తగ్గిస్తుందని తెలిపింది. వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించడానికి 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను అభివద్ధి చేయనుందని తెలిపింది. రైతుల వ్యవసాయానికి ఉచితంగా పగటి పూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్మిషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసిందని నివేదిక తెలిపింది.అందివచ్చిన ఆర్బీకేలు: వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇది ఉత్తమ ఆచరణగా నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రైతులకు నాణ్యమైన ఇన్పుట్లు, సేవలు అందించడంతోపాటు సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిని ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. ఇవి పంటల సేకరణ కేంద్రాలుగా పని చేస్తూ రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా పారదర్శకంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేంద్రాలు అధిక దిగుబడి సాధించడంలోను, పంటల నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడటంలో విజయవంతమయ్యాయని నివేదిక తెలిపింది. ఆర్బీకేలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించిన తరువాత రైతులు తమ ఉత్పత్తులను గ్రామంలోనే విక్రయించుకునే వీలు కలిగింది. వీటి ద్వారా రైతాంగం ప్రభుత్వ పథకాలు నేరుగా పొందుతున్నారు. ముందుగా పరీక్షించడం ద్వారా నకిలీ విత్తనాలను నిరోధించడంతో పాటు ప్రైవేట్ అవుట్లెట్లలో అధిక ధరలను నిరోధిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ, ఉచిత పంటల బీమా నమోదు కార్యక్రమాలు ఆర్బీకేలు నిర్వహిస్తున్నాయి. రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. -
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
జగన్ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను వైఎస్సార్సీపీ సపోర్టర్ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా! - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది. మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్సీపీ బంపర్ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్సీపీ సపోర్ట్ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. –సత్యార్థి -
చీకటి రాత్రులకు బ్రేక్
ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్ స్టేషన్లలో పవర్ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందుతోంది. ‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.గతంతో హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్‌లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్ సరఫరాకు అనుకూలంగా మార్చింది. గతమెంతో ‘హీనం’ రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. రెట్టింపైన ఫీడర్లు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.దీంతో ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి. రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement