Sakshi News home page

అత్యున్నత స్థానంలో భారతి సిమెంట్‌

Published Sat, Mar 25 2017 1:44 AM

అత్యున్నత స్థానంలో భారతి సిమెంట్‌

లేటెస్ట్‌ టెక్నాలజీలో ముందడుగు...
భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి


మహబూబ్‌నగర్‌: సిమెంట్‌ తయారీలో లేటెస్ట్‌ టెక్నాలజీ పద్ధతులను వినియోగిస్తూ వినియోగదారులు కోరుకునే విధంగా నాణ్యమైన సిమెంట్‌ను అందించడంలో భారతి సిమెంట్‌ ఎప్పటికీ ముందుంటుందని ఆ కంపెనీ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సిందుహోటల్‌లో జరిగిన ఇంజనీర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిమెంట్‌ తయారీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అతి తక్కువ సమయంలో లక్షలాది వినియోగదారుల మన్ననలు పొందడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుడి అవసరాలకు ఉపయోగపడే విధంగా, మారుతున్న వాతావరణం, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సిమెంట్‌ను తయారు చేస్తున్న భారతి సిమెంట్‌ కంపెనీ వినియోగదారులకు మేలైన సిమెంట్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్టిఫీషియల్‌ సిమెంట్‌ రంగమైన వికట్‌ సిమెంట్‌ కంపెనీ, భారతి సిమెంట్‌ జాయింట్‌ వెంచర్‌ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారతి సిమెంట్‌ను నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకురావడానికి ఇంజనీర్లు సహకారం అందించాలని ఆయన కోరారు. భారతి సిమెంట్‌ అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ఇంజనీర్ల సహకారం చాలా ఉందన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారతి సిమెంట్‌ గోదాం ఏర్పాటు చేశామని, వినియోగదారుడు ఆర్డర్‌ చేసిన రెండు గంటల వ్యవధిలో సిమెంట్‌ను సరఫరా చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జర్మన్‌ టెక్నాలజీ, రోబోటెక్‌ క్వాలిటీ, ఉడ్‌ ప్యాకింగ్‌ ద్వారా భారతి సిమెంట్‌ను తయారు చేస్తున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా సిమెంట్‌ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకపోవడంతోపాటు, కల్తీ చేసే ఆస్కారం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో జీఎం కొండల్‌రెడ్డి, సీనియర్‌ మేనేజర్‌ ఓబుల్‌రెడ్డి, మేనేజర్లు సతీష్, నరేష్, మణికంఠ, డీలర్లు విజయభాస్కర సిమెంట్‌ ఏజెన్సీస్‌ భాను, విజయభాస్కర్‌రెడ్డితోపాటు 50 మందికి పైగా ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement