Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

Published Thu, Jan 4 2018 9:39 AM

Sensex, Nifty, Midcap open mildly higher - Sakshi

ముంబై : ఆసియన్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌, ప్రారంభమైన కొద్దిసేపటికే ఫ్లాట్‌ ట్రేడింగ్‌లోకి పడిపోయింది. ప్రస్తుతం 41 పాయింట్లు లాభపడి 33,835 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 12 పాయింట్ల లాభంలో 10,455 వద్ద కొనసాగుతోంది. ప్రారంభంలో ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా లాభాలు పండించింది.

ఓఎన్‌జీసీతో పాటు యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, గెయిల్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అదాని పోర్ట్స్‌ టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. అదేవిధంగా టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌ బ్యాంకు, టెక్‌ మహింద్రా ఎక్కువగా నష్టాలు గడించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.2 శాతం పెరిగింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల నష్టంలో 63.53గా ఉంది.  ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు రూ.56 లాభంలో రూ.29,218గా ఉన్నాయి.  

Advertisement

What’s your opinion

Advertisement