ప్రేమికుల విషాదాంతం

10 May, 2019 07:08 IST|Sakshi
కుమార్, నందిని మృతదేహాలు

ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం 

యువకుడిది పోలేపల్లి,  యువతిది కావేరమ్మపేట 

ఈ నెల 19న యువతి పెళ్లి.. అంతలోనే ఘటన 

జడ్చర్ల: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పైగా ఇద్దరిదీ ఒకే కులం.. కానీ యువతి పెళ్లి నిశ్చయమైందని మనస్తాపానికి గురై.. ఇద్దరూ కలిసి యువకుడి ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన గురువారం మండలంలోని పోలేపల్లిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పోలేపల్లికి చెందిన ఎట్టి కుమార్‌(20), కావేరమ్మపేట అంబేద్కర్‌కాలనీకి చెందిన నందిని(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నందినికి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లిని కుదిర్చారు. ఈ నెల 19న ముహూర్థం కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో నందిని తాను ప్రేమించిన కుమార్‌తో బుధవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది.

మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన నందిని కోసం తండ్రి రవి, కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో పోలేపల్లిలోని ఎస్సీకాలనీ కుమార్‌ ఇంటిలో కుమార్‌తోపాటు మరో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్‌ఐ షంషుద్దీన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కిందకు దించారు. అనంతరం పంచనామా నిర్వహించి ఇద్దరి మృతదేహాలను ఆటోలో పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాట్సప్‌లో వచ్చిన యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.


నిరుపేద కుటుంబాలు.. 
ఆత్మహత్యకు పాల్పడిన యువతీ, యువకులది నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఎట్టి కుమార్‌కు అన్న నర్సింహులు మాత్రమే ఉండగా వీరి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు నర్సమ్మ, పెంటయ్యలు మృతిచెందారు. అనంతరం వీరిని ఖానాపూర్‌లో ఉన్న మేనమామ కృష్ణయ్య చేరదీసి ఉపాధి కల్పించాడు. పోలేపల్లిలో ఉన్న పూరింటిని కూడా ఆయన సహకారంతోనే నిర్మించుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ ఖానాపూర్‌లోని మేనమామ దగ్గరే ఉన్నారు. అన్న నర్సింహులు మేనమామకు చెందిన టిప్పర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తుండగా తమ్ముడు కుమార్‌ టీహోటల్‌ నడుపుతుండేవాడు.

అయితే 20 రోజుల క్రితమే ఖానాపూర్‌ నుంచి వచ్చి పోలేపల్లిలోని తన ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పోలేపల్లి నుంచి జడ్చర్లకు ఆటో నడుపుతున్న సమయంలో వరుసకు బంధువు అయిన నందినితో పరిచయమైనట్లు సమాచారం. వీరి పరిచయం ప్రేమగా మారడం, అంతలోనే నందినికి వేరే వ్యక్తితో పెళ్లి కుదరడం, పెళ్లి కుమారుడు విడాకులు తీసుకున్న వ్యక్తి కావడంతో నందినికి పెళ్లి ఇష్టం లేనట్లుగా తెలిసింది. నందిని తల్లి చంద్రకళ కూడా మూడేళ్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో తండ్రి రవి ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

నందిని అక్క సంధ్యకు పెళ్లి కాగా చెల్లి అంకిత చదువుకుంటుంది. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో నందిని బుధవారం రాత్రి కుమార్‌తో కలిసి ఆటోలో పోలేపల్లిలోని కుమార్‌ ఇంటికి చేరుకుని ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇంటికి ఉన్న కేబుల్‌ కనెక్షన్‌ వైరును కటింగ్‌ బ్లేడ్‌తో కట్‌ చేసి ఆ వైర్లనే తమ గొంతులకు ఉరిగా బిగించుకున్నారు. రాత్రి 10 గంటల ప్రాం తంలో కుమార్‌కు బంధువైన ఒకరు ఇంటి తలుపు తట్టినా అలికిడి లేకపోవడంతో నిద్రపోయాడని భావించి వెళ్లిపోయాడు. ఉదయం గ్రామస్తులు కుమార్‌ కోసం వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో పక్కనే వెంటిలేటర్‌ గుండా చూడడంతో ఇరువురు మృతదేహాలు వేలాడుతూ కనిపించడంతో తలుపులు గట్టిగా నెట్టి చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి పంచనామా నిర్వహించారు. 

కేసు నమోదు..
ఆత్మహత్యకు పాల్పడిన నందిని పెళ్లి మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో ఆయా ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఇంటికి రంగులు వేసుకుని పెళ్లి పత్రికల పంపిణీ తదితర పనుల్లో ఉన్నారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడిన కుమార్‌ అన్న నర్సింహులు కూడా గురువారం పెళ్లి చూపులకు వెళ్లే ఏర్పాట్లలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెచ్చిపోయిన పోకిరీలు: వీడియో వైరల్‌

మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం

ముఖం చెక్కేసి.. కనుగుడ్లు పెరికి..

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ

కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ

ఆన్‌లైన్‌లో ఆడుకున్నారు..

ఈ అర్చన వలలో పడితే ఇక అంతే

అన్నదాత ఆత్మహత్య

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

నేను చచ్చాకైనా న్యాయం చేయండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మంటగలిసిన మాతృత్వం

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని 

ఏఎస్‌ఐ వీరంగం

అరెస్టయితే బయటకు రాలేడు

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

మ్యాట్రిమోని సైట్‌లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్‌ దందా

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్‌ పొసుకొని..

మంచిర్యాలలో మాయలేడి

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా

15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు

అమ్మకం వెనుక అసలు కథేంటి?

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

కట్టుకున్నోడే కాలయముడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు