Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం

Published Mon, Nov 27 2017 2:41 AM

Speed killed three people - Sakshi - Sakshi

హైదరాబాద్‌: ఇటీవల హైదరాబాద్‌లోని సుచిత్ర చౌరస్తా వద్ద నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని మరువక ముందే గుండ్లపోచంపల్లి అయోధ్య జంక్షన్‌కు కూతవేటు దూరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం సేవించి ముగ్గురు యువకులు వేగంగా బైక్‌ నడిపి చెట్టుకు ఢీకొని గోడ కు గుద్దుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకు లు అక్కడికక్కడే మృతి చెందారు. పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా బైరాపూర్‌ గ్రామానికి చెందిన నానావత్‌ అనీల్‌కుమార్‌ (26) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదివి మానేశాడు. అనీల్‌ చిన్నాన్న కుమారుడైన చింటూ (20) టీస్టాల్‌ ఏర్పాటు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం గుండ్లపోచంపల్లికి వచ్చాడు.

నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం నాచారిపేట్‌కు చెందిన కందాడి శశిధర్‌రెడ్డి (22) ఐటీఐ పూర్తి చేసి ఓ పరిశ్రమలో అప్రెంటీస్‌గా ఎలక్ట్రిక్‌ పనులు చేస్తున్నా డు. అనీల్, శశిధర్‌రెడ్డి స్నేహితులు. ఈ ముగ్గురు శనివారం రాత్రి అయోధ్య జంక్షన్‌ వద్ద మాధవన్‌ బార్‌లో మద్యం సేవించారు. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అవెంజర్‌ బైక్‌పై బయ లుదేరారు. బైక్‌ను అతివేగంగా నడపడంతో కొద్ది దూరం వెళ్లగానే అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టారు. ముగ్గురు చెల్లాచెదురుగా పడి తలలు పగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై శ్రీనా«థ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతుల బంధువుల కు సమాచారం చేరవేశారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఈ నెల 17న సుచిత్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డ విషయాన్ని మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. 

వద్దని తల్లి వారించినా.. రాత్రి 10.30 కు బయటకు వెళ్లి..
శనివారం రాత్రి 10.30 సమయంలో అనీ ల్, చింటూతో పాటు శశిధర్‌రెడ్డి ముగ్గురూ బయటకు వెళ్తుండగా అనీల్‌ తల్లి వెళ్లొద్దని వారించింది. ఇప్పుడే వస్తాం.. అంటూ వెళ్లిపోయిన వారు విగత జీవులుగా మారడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది. శనివారం మధ్యాహ్నం నుంచే అనీల్, చింటూ మద్యం తాగుతూ ఉన్నారని, శశిధర్‌రెడ్డి రావడంతో మళ్లీ ముగ్గురు బైక్‌పై వెళ్లారని అనీల్‌ సోదరుడు అజయ్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

Advertisement

What’s your opinion

Advertisement