Sakshi News home page

పల్లెలకు పన్ను పోటు

Published Sun, Mar 5 2017 11:33 PM

house tax 3 times increased

మూడింతలు పెరిగిన ఇంటిపన్ను
కొత్తగా గ్రంథాలయం, క్రీడా సెస్సు
మంచినీరు ఇవ్వకపోయినా నీటిపన్ను
డ్రైనేజీ, లైటింగ్‌ పన్నులు అదనం
లబోదిబోమంటున్న గ్రామీణులు
రేషనలైజ్‌ చేశామంటున్న అధికారులు
గతంలో తక్కువ వసూలు చేశామంటూ వివరణ
సాక్షి, రాజమహేంద్రవరం : పన్నులు వేసి ప్రజల ముక్కుపిండి వసూలు చేయడంలో తనకు తానే సాటి అని టీడీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుం టోంది. గతంలో సీఎంగా పని చేసిన కాలంలో విద్యుత్‌ చార్జీలు, ఇంటి పన్నులు, వివిధ రకాల సెస్సుల పేరుతో గ్రామీణులు, రైతుల నుంచి భారీ ఆదాయం రాబట్టుకున్న చంద్రబాబు.. ఈ దఫా కూడా తన పంథా ఏమాత్రం మార్చుకోలేదు. గ్రామాల్లో ఇంటి పన్నులు మూడింతలు పెరగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోం ది. వీటితోపాటు త్వరలో విద్యుత్‌ చార్జీల వడ్డనకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో  ఇంటి పన్నులు గతంలో కన్నా మూడింతలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా గ్రం«థాలయం, క్రీడా సెస్సు లు, లైటింగ్, నీటి పన్నులు విధించిన ప్రభుత్వం.. ఆ మేరకు నూరు శాతం వసూళ్లు చేయాలంటూ అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తోంది.
మూడు రెట్లు పెరిగిన ఇంటి పన్నులు
2013–14 ఆర్థిక సంవత్సరంలో ఓ ఇంటికి రూ.135గా ఉన్న ఇంటి పన్ను ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.520కి పెరిగింది. రూ.135లో ఇంటి పన్ను రూ.125, గ్రంథాలయం సెస్సు రూ.10 లెక్కన వసూలు చేశారు. తాజాగా అదే ఇంటికి వేసిన రూ.520 పన్నులో పలు రకాలు ఇంటి పన్ను రూ.352, గ్రంథాలయం సెస్సు రూ.28, లైటింగ్‌ పన్ను రూ.35, డ్రైనేజీ పన్ను రూ.70, క్రీడా సెస్సు రూ.35 చొప్పున విధించారు. ఇంటి విస్తీర్ణాన్నిబట్టి ఈ లెక్కలు మారుతూంటాయి. ఇంటి పన్ను మొత్తంలో 8 శాతం జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లిస్తూండగా, మిగతా సొమ్ము పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
లేని సేవకు సెస్సులు, పన్నులు : ఏదైనా ఒక సేవను ఆ ప్రాంతంలోని ప్రజల కు అందిస్తున్నప్పుడు సాధారణంగా ప్రభుత్వం పన్ను లేదా సెస్సు విధిస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సేవపై 0.5 శాతం సెస్సు విధిస్తోంది. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలుండగా, చాలాచోట్ల గ్రంథాలయాలు లేవు. పంచాయతీ కార్యాలయాల్లో కనీసం దినపత్రికలు కూడా దొరకవు. అలాంటిది ఇం టి విస్తీర్ణం ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాల యం పన్ను వసూలు చే స్తోంది. క్రీడా సెస్సు వసూలు చేస్తోంది. వీటితోపాటు మంచినీటి సరఫరా లేకపోయినా, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రజలు పన్నులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. గ్రామాల్లో వీధిదీపాలు వెలిగినా, వెలగకపోయినా ఏడాదికి సరిపడా లైటింగ్‌ పన్ను చెల్లించాల్సిందే. ప న్ను వసూళ్లలో నూరు శాతం లక్ష్యం చేరుకోని సిబ్బం దిపై చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా, పన్నులు పెరగలేదని, గతంలో తక్కువ వసూలు చేశారని, ఇప్పుడు రేషనలైజేష¯ŒS చేయడంవల్ల కొందరి ఇంటి పన్నులు పెరగగా, మరికొందరివి తగ్గాయని అధికారులు అంటున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం.. లేని సౌకర్యాలకు పన్నులు గుంజడంపై గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement