Sakshi News home page

31 నుంచి మోపిదేవి బ్రహ్మోత్సవాలు

Published Fri, Jan 13 2017 7:31 PM

31 నుంచి మోపిదేవి బ్రహ్మోత్సవాలు - Sakshi


మోపిదేవి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం వాల్‌పోస్టర్లు విడుదల చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 1న స్వామివారి కల్యాణం, 2వ తేదీ ర«థోత్సవం జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విచ్చేస్తారని చెప్పారు.  బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో శాంతి కల్యాణం, వివాహాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌కుమార్‌శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ సూపరింటెండెంట్‌ మధుసూదనరావు, ఆలయ అధికారులు నాగమల్లేశ్వరరావు, కేశవరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


 

Advertisement

What’s your opinion

Advertisement