రూ.14 కోట్ల ఉపకార వేతనాల చెల్లింపు | Sakshi
Sakshi News home page

రూ.14 కోట్ల ఉపకార వేతనాల చెల్లింపు

Published Tue, Nov 22 2016 11:17 PM

paid rs 14 crores scholarships

ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌గా రూ.14 కోట్లు అందచేసినట్టు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ రంగలక్ష్మిదేవి చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు సంబంధించి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి పంపాలని కోరారు. జిల్లాలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ట్‌ప్పుల కోసం రూ. 20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకూ రూ.14 కోట్లు అందించామని ఇంకా రూ.6 కోట్ల మేర ఉపకార వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. దరఖాస్తు చేసేటప్పుడు 103 జీవోలోని నిబంధనలను పాటించాలని సూచించారు. సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్‌ డీడీ మూర్తి, సోషల్‌ వెల్ఫేర్‌  సాల్మన్‌రాజు, ఐటీడీఏ తరఫున కిషోర్ పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement