Sakshi News home page

అరుదైన వైరాగినాగు హతం

Published Sat, Oct 10 2015 1:32 AM

అరుదైన వైరాగినాగు హతం - Sakshi

సర్పాల్లో అరుదైన వైరాగినాగు శ్రీకాకుళం జిల్లా మందస మండలం లక్ష్మీనారాయణపురంలోని స్థానికుల చేతిలో హతమైంది. అరణ్యాల్లోను, పెద్ద పెద్ద కొండల్లో మాత్రమే సంచరించే ఈ పాము తోకను నేలపై ఉంచి  తలతోపాటు శరీరం మొత్తం గాలిలో నిలబెడుతుంది.  సుమారు 13 అడుగుల పొడవున్న ఈ వైరాగినాగు శుక్రవారం మందస మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం వద్ద జనారణ్యంలోకి వచ్చింది.  ఓ ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది రైతులు ధైర్యం చేసి దానిని హతమార్చారు.      
 - మందస

Advertisement

What’s your opinion

Advertisement