Sakshi News home page

నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వాయిదా

Published Sun, Nov 20 2016 1:04 AM

ysrcp meeting cancel

 
– వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఆదివారం నిర్వహించ తలపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలను వాయిదా వేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెళ్లిళ్లు, కార్తీక వనభోజనాలు తదితర కార్యక్రమాలు ఉన్నందువల్ల కార్పొరేషన్‌ పరిధిలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు వార్డులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Advertisement

What’s your opinion

Advertisement