Sakshi News home page

బయోటెక్నాలజీలో ఎంబీఏ...

Published Thu, Apr 30 2015 12:35 AM

MBA IN Biotechnology Courses


 నానోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 -శ్రీధర్, ఆదిలాబాద్
 కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
 హర్యానాలోని కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ డిగ్రీని అందిస్తోంది.
 అర్హత: ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ మెటీరియల్ సైన్స్/ నానోసైన్స్ అండ్ టెక్నాలజీలలో ఎంఎస్సీ లేదా బయోటెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
 ప్రవేశం: గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.nitkkr.ac.in
 కేరళలోని కాలికట్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
 ప్రవేశం: గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: http://nitc.ac.in/
 ఉత్తరాఖండ్‌లో రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.iitr.ac.in
 
 బయోటెక్నాలజీలో ఎంబీఏ అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 -వేణు, ఆదిలాబాద్
 హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.. బయోటెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
 అర్హత: కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.ipeindia.org
 న్యూఢిల్లీలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. బయోటెక్నాలజీలో ఎంబీఏ డిగ్రీని అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో లైఫ్ సెన్సైస్‌లో డిగ్రీ.
 ప్రవేశం: మ్యాట్/ఎక్స్‌ఏటీ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.amity.edu
 పుణెలోని పుణె యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ సైన్స్ డిపార్ట్‌మెంట్.. బయోటెక్నాలజీలో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
 అర్హత: బయాలజీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/ లైఫ్‌సెన్సైస్/ మెరైన్ బయాలజీ/ మైక్రోబయాలజీ/జువాలజీలలో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత.
 ప్రవేశం: ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వహించే ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్(ఏటీఎంఏ) పరీక్షలో స్కోర్ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.pumba.in.
 ముంబైలోని పద్మశ్రీ డీవై పాటిల్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ డిగ్రీని అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
 ప్రవేశం: దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.dypatil.com
 ఉపాధి అవకాశాలు: డ్రగ్ డెవలప్‌మెంట్, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్ న్యూట్రీషన్, ఎన్విరాన్‌మెంటల్ కన్జర్వేషన్, యానిమల్ సెన్సైస్ లాంటి సంస్థల్లో, ప్రభుత్వ విభాగాలకు చెందిన బయోటెక్నాలజీ, హార్టీకల్చర్ లాంటి సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి.
 
 విదేశీ భాషల్లో దేన్ని నేర్చుకోవడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయో తెలపండి?
 -అశోక్, జడ్చర్ల
 కొన్ని యూనివర్సిటీల వివరాలు:
 హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్‌లలో ఎంఏను ఆఫర్ చేస్తోంది. దానితో పాటు ఫ్రెంచ్/జర్మన్/ రష్యన్ భాషలలో జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా లాంటి కోర్సులను అందిస్తోంది.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ.. అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్ భాషల్లో ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంఏ డిగ్రీని అందిస్తోంది. దీనితో పాటు ఒకేడాది అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రష్యన్ కోర్సును అందిస్తోంది.
 హైదరాబాద్‌లోని అలియన్స్ ఫ్రాంఛైజ్.. ఫ్రెంచ్‌లో డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
 వెబ్‌సైట్:
 http://hyderabad.afindia.org/
 

Advertisement

What’s your opinion

Advertisement