Sakshi News home page

సుడిగాలుల గ్రహం

Published Sun, Nov 15 2015 3:46 AM

సుడిగాలుల గ్రహం

సౌరకుటుంబానికి ఆవల ఉన్న అనేకానేక గ్రహాల్లో ఇదీ ఒకటి. ఈ ఎక్సోప్లానెట్  పేరు హెచ్‌డీ189733బీ. ఆ వెనుకలా నారింజ రంగులో మెరిసిపోతూ కనిపిస్తోందే... అదే ఈ గ్రహానికి సూర్యుడు. ఇక హెచ్‌డీ189733బీ చుట్టూ తెల్లగా కనిపిస్తున్నది దాని వాతావరణ పొర. ఓ ఎక్సోప్లానెట్ వాతావరణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కావడం ఈ ఆవిష్కరణ తాలూకూ ఒక విశేషమైతే.. ఈ గ్రహంపై వీచే గాలుల వేగం విశేషం. సూర్యుడికి ఎదురుగా ఉన్న ప్రాంతం నుంచి వెనుకవైపునకు వీచే గాలుల వేగం గంటకు 5400 మైళ్లు! సాధారణ పరిస్థితుల్లో భూమ్మీది వీచే బలమైన గాలులకు 20 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ధ్వనివేగానికి ఏడురెట్లు!

Advertisement

What’s your opinion

Advertisement